ఉరేసుకుంటానంటున్న తారా చౌదరి

హైదరాబాద్: విజయవాడ పోలీసులు తనపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని సినీనటి తారా చౌదరి ఆరోపించారు. తనపై పీడీ యాక్ట్ పెడతారని, రౌడీ షీట్ తెరుస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తారా చౌదరి విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తన కుటుంబంలో జరిగిన గొడవపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. తనపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ రాముడు తనను వారి ఇంటిలోని ఆడపిల్లలాంటిదానిగా భావించాలని కోరారు. తానే తప్పూ చేయలేదని అన్నారు. విజయవాడ దుర్గమ్మపై ప్రమాణం చేసి చెబుతున్నానని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరారు. తాను తప్పు చేసిఉంటే పీడీ యాక్ట్ కాదు, ఉరితీసినా అంగీకరిస్తానని చెప్పారు. తాను తప్పు చేసినట్లు రుజువైతే మరుక్షణమే తానే ఉరి తీసుకుంటానని అన్నారు. తానెప్పుడూ కూడా తప్పుచేయలేదని, తనపై ప్రతిసారీ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. నార్కో ఎనాలసిస్‌తో సహా ఏ విచారణకైనా తాను సిద్ధమేనని అన్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన తారా చౌదరి, తనకు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు చెప్పి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె ఇంట్లో పలువురు ప్రముఖుల రాసలీలల వీడియో సీడీలు పోలీసులకు లభ్యమవటం రాష్ట్రమంతా చర్చనీయాంశమయింది. తాజాగా సొంత వదినపై, ఒక మహిళా కానిస్టేబుల్‌పై దౌర్జన్యం చేశారని విజయవాడలో సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close