సెన్సార్ బోర్డ్ కి మంచిరోజులు

కేంద్ర సెన్సార్ బోర్డ్ కు మంచిరోజులు రాబోతున్నాయి. ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ వంటి మేధావుల సలహాలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. సెన్సార్ బోర్డ్ మీద పడిన మరకలను చెరిపేసే పని మొదలుపెట్టింది.

సెన్సార్ బోర్డ్ పనితీరుని మెరుగుపరచడం, వివాదరహితంగా ముందుకుసాగేలా చూడటం కోసం సలహాలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. సెన్సార్ బోర్డ్ పునర్నిర్మాణానికి అవసరమైన సూచనలు చేయడం కోసం ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ తో కూడిన ఒక కమిటీని ఇవ్వాళ (జనవరి 1) కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసి బోర్డ్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.

ఇటీవలి కాలంలో సెన్సార్ బోర్డ్ పనితీరుపట్ల తరచూ విమర్శలొస్తున్నాయి. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంలోనూ, కొన్ని సీన్లు కట్ చేయడంలోనూ బోర్డ్ తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. దీనికి తోడు బోర్డ్ సభ్యులు ఒకొరొకరిగా వెదొలిగాల్సిన పరిస్థితులు రావడం, బోర్డ్ చైర్మన్ తీసుకునే నిర్ణయాలపై కేంద్రప్రభుత్వం విసిగిపోవడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డ్ ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తామని ఆ మధ్య కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సూచనప్రాయంగా తెలియజేశారు. ఇప్పుడది ఆకారం దాల్చబోతున్నది.

శ్యామ్ బెనెగల్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కొత్త కమిటీ రెండు నెలల్లో తన నివేదికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ కమిటీలో శ్యామ్ బెనెగల్ తో పాటుగా, చిత్రనిర్మాత రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా, `యాడ్ మ్యాన్’ పియూష్ పాండే, ఫిల్మ్ క్రిటిక్ భావనా సోమాయ, నేషనల్ ఫిల్మ్ డెవెలప్మెంట్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ నినాలాథ్ గుప్తా, జాయింట్ సెక్రటరీ (ఫిల్మ్స్) సంజయ్ మూర్తిలు ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు తగ్గట్టుగానే ఈ కమిటీని రూపొందించడం జరిగిందని సమాచార, ప్రసారాల శాఖ తెలియజేసింది. సినిమాలకు సర్టిఫికేట్ జారీచేయడంలో పాటించాల్సిన మార్గదర్శకాల నుంచి సెన్సార్ బోర్డ్ సభ్యుల విధివిధానాల వరకు ఈ కమిటీ సూచనలు చేయవచ్చు. అంతేకాకుండా సినిమాటొగ్రాఫ్ యాక్ట్ లో మార్పులను కూడా ఈ కమిటీ సూచించే వీలుంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి తనకు ఈ మేరకు సమాచారం అందినట్లు సీనియర్ దర్శకులు శ్యామ్ బెనెగల్ ధ్రువీకరించారు. సెన్సార్ బోర్డ్ పనితీరుని వివాదరహితంగా చేయడానికి ఈ కమిటీ ఉద్దేశించబడిందని శ్యామ్ బెనెగల్ చెప్పారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సి) సంస్థనే సాధారణ భాషలో సెన్సార్ బోర్డ్ గా పిలుస్తుంటారు. 2015 ఆరంభంలోనే బోర్డ్ వివాదంలో కూరుకుపోయింది. పహ్లాజ్ నిహ్లానీ ప్రవేశపెట్టిన కొన్ని పద్ధతులను తోటి సభ్యులే వ్యతిరేకించారు. దీనికితోడు ప్రధాని నరేంద్రమోదీపై నిర్మించిన మ్యూజిక్ వీడియో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖనే ఇబ్బందుల్లో పడేసింది. దీనికి తోడుగా సెన్సార్ బోర్డు తీరుతెన్నులపై చిత్రనిర్మాతలు మండిపడే పరిస్థితి ఏర్పడింది. చిత్రనిర్మాతలు, నటీనటులు, మేధావుల నుంచి వెల్లువెత్తిన నిరసనల దృష్ట్యా సెన్సార్ బోర్డ్ ని ప్రక్షాళన చేయాలని గత కొంతకాలంగా కేంద్రం భావిస్తోంది. పానెల్ నియామకంతో ఆ పనికి శ్రీకారం చుట్టినట్లయింది. సెన్సార్ బోర్డ్ లో ఎలాంటి వారిని నియమించాలి (చైర్మన్ తో సహా) వారి విధివిధానాలు ఎలా ఉండాలి, సినిమాటొగ్రాఫ్ చట్టంలో ఎరకమైన సవరణలు తీసుకురావాలన్న అంశాలపై శ్యామ్ బెనెగల్ వంటి వారితో ఏర్పాటైన ఈ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి తన నివేదికను అందజేయవచ్చు. ఆ నివేదికను రాజకీయాలకు అతీతంగా కేంద్రం అమలుపరిస్తే సెన్సార్ బోర్డ్ కు పట్టిన గ్రహణం తొలిగిపోతుందని చలన చిత్ర ప్రముఖులు భావిస్తున్నారు. అందుకే ఈ కమిటీ ఏర్పాటును ఓ శుభపరిణామంగా సినీవర్గాలు చెబుతున్నాయి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close