సమీక్ష : కన్ ఫ్యూజన్ లో అబ్బాయితో అమ్మాయి

నటీనటులు : నాగాశౌర్య, పాలక్ లల్వాని, మోహన్, రావు రమేష్

సంగీతం : మ్యాస్ట్రో ఇళయరాజా

సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు

దర్శకత్వం : రమేష్ వర్మ

నిర్మాతలు : జె. వందన అలేఖ్య, పి. కిరీటి, ఎస్. శ్రీనివాస్

తెలుగు360 రేటింగ్ : 2.25/5

కొన్ని కథలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తే మరి కొన్ని కథలు పాత్రం ప్రేక్షకులను కూడా కథ కథనాలతో ట్రావెల్ చేసేలా ఉంటాయి. రోజు జరిగే విషయాలు, ఎప్పుడు వచ్చే రొటీన్ సినిమాల్లా కాకుండా చాలా కొత్తగా స్నేహం, ప్రేమ అనే విషయాన్ని ప్రయత్నించడానికి రమేష్ వర్మ నడుం కట్టారు. నాగ శౌర్య, పాలక్ లల్వాని జంటగా నటించిన అబ్బాయితో అమ్మాయి సినిమా రమేష్ వర్మ దర్శకత్వంలో ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి సినిమా అనుకున్నట్టుగా ప్రేక్షకులకు నచ్చిందా లేదా అనేది ఈనాటి మన సమీక్షలో చూద్దాం.

కథ :

అబ్బాయి, అమ్మాయిల మధ్య లస్ట్ (కామోద్రేకం) మాత్రమే ఉంటుంది మరెటువంటి ఫీలింగ్స్ ఉండవని నమ్మే పాత్ర గల అభి (నాగశౌర్య) తన తెలివితేటలతో ప్రార్ధన (పాలక్ లల్వాని)ని ప్రేమలో దించుతాడు. ఇక అదే విధంగా తనకు ఫేస్ బుక్ ఫ్రెండ్ సమంతతో పరిచయం పెంచుకుంటాడు. సమంతతో పవన్ కళ్యాణ్ గా ఫీలింగ్ షేర్ చేసుకుంటూ.. ప్రార్ధనతో రొమాంటిక్ గై గా ఆమెను ముగ్గులోకి దింపి ఆమెతో శృంగారం కూడా చేస్తాడు అభి. అభి ఏం చేసినా సపోర్ట్ చేసే తల్లిదండ్రులు ఈ విషయంలో అభి మీద కోప్పడి అతనితో చనువుని తగ్గించుకుంటారు. ఈ లోగా విషయం తెలిసిన ప్రార్ధన తండ్రి (రావు రమేష్) ఆమెను అభి ఇంట్లో వదిళెల్తాడు. ప్రేమికుడిగా దూరమైన అభి ఫ్రెండ్ గా ఆమెకు ఎలా దగ్గరయ్యాడు..? సమంత, పవన్ కళ్యాణ్ గా మాట్లాడేది ఇద్దరు వీరే అనే విషయం ఎలా తెలుస్తుంది..? చివరగా అభిని ప్రార్ధన క్షమించిందా..? అన్నది అసలు కథ.

సాంకేతిక నిపుణత :

అబ్బాయితో అమ్మాయి సినిమాకు ఇంత హైప్ తీసుకువచ్చినది ఒకటి దర్శకుడు రమేష్ వర్మ అయితే.. మరొకరు సంగీత దర్శకుడు ఇళయరాజా. సినిమాకు ప్రాణం అంటూ ఏదైనా ఉంటే అది కేవలం సంగీతం మాత్రమే. కథ కథనాల్లో లోపాలు చాలా కనిపించినా ఇళయరాజా సంగీతం బాగా హెల్ప్ అయ్యింది. సినిమాకు నేపథ్య సంగీతం అద్భుతం అని చెప్పాలి. రమేష్ వర్మ దర్శకుడిగా మరోసారి ఫెయిల్ అయ్యాడు. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి గ్రాండ్ లుక్ తెచ్చిపెట్టింది. ప్రతి ఫ్రేంలో హీరోయిన్ ని అందంగా చూపించడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

నటీనటుల ప్రతిభ – విశ్లేషణ :

కథకు కథనానికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎన్నో కథలు కథనాల్లో లోపం వల్ల ఫ్లాప్ అయిన చరిత్ర ఉంది. ఎన్నో కథలు కథనంలో పర్ఫెక్షన్ వల్ల సూపర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయ్. అయితే రమేష్ వర్మ ప్రయత్నించిన అబ్బాయితో అమ్మయి కథ విషయానికొస్తే సృజనతో కథ రాసుకున్నా ఆ సెన్స్ టివ్ నెస్ కథనంలో చూపించడం విఫలమై ఆడియెన్స్ ని కన్ ఫ్యూజ్ చేశాడు. దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ లవర్ గా తనని మోసం చేసినా సరే స్నేహితుడిగా తన కెరియర్ కు సహకరించే హీరో కథ. స్నేహం మనిషి గొప్పగా బ్రతకడానికి కారణం అవ్వడం అనేది కథ. అయితే దీన్నే తెరకెక్కించే విధానంలో చాలా తప్పులు దొర్లేలా చేసి సినిమా చివరకు ఆడియెన్స్ కి కూడా క్లారిటీ లేకుండా చేశాడు. కథ కూడా ఇదివరకు చాలా సినిమాల్లో చూసిన దానిలా అనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు దర్శకుడి క్రియేటివిటీకి కొన్ని కారణాలు ఉండవన్నట్టు.. ఈ సినిమాలో దర్శకుడి పొరపాట్లు చాలా కనిపిస్తాయి.

ఇక సినిమా నటీనటుల విషయానికొస్తే నాగశౌర్య తన పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. సినిమాలో కాస్త మెచ్యుర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. ఇక ప్రార్దనగా పాలక్ లల్వాని అదరహో అనిపించింది. అమ్మడు అందానికి అందం, అభినయానికి అభినయం అన్నట్టు మొదటి సినిమానే అయినా ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా అంగాంగ ప్రదర్శన చేసి సినిమాలో కాస్త రీ ఫ్రెష్మెంట్ ఫీల్ ని కలిగిస్తుంది. సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు జంట అదుర్స్ అనిపిస్తుంది. రోమాన్స్ లో కూడా ఇద్దరు అదరగొట్టేసారు. ఇక మౌనరాగం మోహన్ పాత్ర పరిధి మేరకు న్యాయం చేశాడు. హీరోయిన్ తండ్రిగా మరోసారి రావు రమేష్ విజృంభించినా ఆ పాత్ర రాసుకున్న దర్శకుడు క్లారిటీ మెయింటైన్ చేయలేదని అనిపిస్తుంది. సినిమా మొత్తం కేవలం 7 క్యారక్టర్స్ తో నడిపించడం మెచ్చుకోదగ్గ విషయం.

ప్లస్ పాయింట్స్ :

నాగ శౌర్య

పాలక్ లల్వాని

ఇళయరాజా సంగీతం

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

కథ, కథనాలు

నేరేషన్

ఎడిటింగ్

దర్శకత్వం

తీర్పు:

నాగశౌర్య, పాలక్ లల్వాని జంటగా నటించిన అబ్బాయితో అమ్మాయి సినిమా దర్శకుడు రమేష్ వర్మ కొత్తగా ఏదో చేద్దామనే ప్రయత్నం చేద్దామని చూసినా కథ కథనాల్లో కన్ ఫ్యూజన్ వల్ల సరిగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేదు. సినిమాలో మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అద్భుతం. చివరగా నూతన సంవత్సరంలో మొదటి రోజు వచ్చిన అబ్బాయితో అమ్మాయి సరిగా ఆకట్టుకోలేదని చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close