2016 మే లోనే ప్రభాస్‌ కొత్త సినిమా స్టార్ట్‌ అవుతుందట.!

‘బాహుబలి’ కోసం మూడేళ్ళు కష్టపడిన ప్రభాస్‌ ఇప్పుడు ‘బాహుబలి2’ షూటింగ్‌లో బిజీగా వున్నాడు. ఈ చిత్రాన్ని 2016లోనే రిలీజ్‌ చేస్తానని రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సంవత్సరం ఈ సినిమా రిలీజ్‌ అయ్యే అవకాశాలే లేవని టాలీవుడ్‌లో, ట్రేడ్‌ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కానీ, ఈ సంవత్సరం మే లోనే ప్రభాస్‌ కొత్త సినిమా స్టార్ట్‌ అవుతుందని వస్తున్న వార్తల్ని బట్టి చూస్తే రాజమౌళి అన్నంత పని చేసేలా కనిపిస్తున్నాడు. ‘బాహుబలి’ స్టార్ట్‌ అయిన తర్వాత తన నెక్స్‌ట్‌ మూవీ ‘రన్‌ రాజా రన్‌’ డైరెక్టర్‌తోనే చేస్తానని ప్రభాస్‌ చెప్పాడు. అతను చెప్పినట్టుగానే మే లో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవుతోంది. స్క్రిప్ట్‌ మీద బాగా వర్కవుట్‌ చెయ్యమని ప్రభాస్‌ ఇచ్చిన సలహాను పాటిస్తూ సుజీత్‌ అదే పనిగా స్క్రిప్ట్‌ని చెక్కుతున్నాడట. స్క్రిప్ట్‌ని హండ్రెడ్‌ పర్సెంట్‌ పక్కాగా రెడీ చేసుకొని మే నుంచి షూటింగ్‌ వెళ్ళాలని ప్రభాస్‌, సుజీత్‌ భావిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ప్రభాస్‌ సొంత సంస్థ అయిన యు.వి. క్రియేషన్స్‌ బేనర్‌లో వంశీ, ప్రమోద్‌ నిర్మించనున్నారు. మరో కొత్త విశేషమేమిటంటే ఈ చిత్రంలో ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడట. ఫస్ట్‌ టైమ్‌ ప్రభాస్‌ చేస్తున్న ఈ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ చాలా పవర్‌ఫుల్‌గా వుంటుందని సమాచారం. ‘మిర్చి’, ‘రన్‌ రాజా రన్‌’, ‘శ్రీమంతుడు’ సూపర్బ్‌ ఫోటోగ్రఫీ అందించిన మది ఈ కొత్త చిత్రానికి కూడా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేస్తారట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close