నాన్నకు ప్రేమతో రివ్యూ ….సుకుమార్ మరో సారి కొత్త ప్రయత్నం

తెలుగు360.కామ్ రేటింగ్ 3/5
బ్యానర్ :శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి, & రిలయన్స్
నటీనటులు: ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌,
రాజేంద్రప్రసాద్‌, జగపతిబాబు, రాజీవ్‌ కనకాల,
అవసరాల శ్రీనివాస్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌
రచన, దర్శకత్వం: సుకుమార్‌
విడుదల తేదీ: 13.01.2016

యాక్షన్‌ హీరోగా, మాస్‌ హీరోగా ఇమేజ్‌ తెచ్చుకున్న ఎన్టీఆర్‌, తన ప్రతి సినిమానూ విభిన్నంగా రూపొందించే సుకుమార్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే ఆడియన్స్‌ చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వుంటాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి బేనర్‌పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఈ సినిమా ఎంతవరకు రీచ్‌ అయింది? ఎన్టీఆర్‌, సుకుమార్‌ల ఫస్ట్‌ మూవీకి ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చింది? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.

కథ: తండ్రి సుబ్రహ్మణ్యం(రాజేంద్రప్రసాద్‌) కోటీశ్వరుడు. ఆయనకి ముగ్గురు కొడుకులు. పెద్దవాడు రాజీవ్‌ కనకాల, రెండవవాడు అవసరాల శ్రీనివాస్‌, మూడోవాడు మన హీరో అభిరామ్‌(ఎన్టీఆర్‌). అన్ని జీవుల్లోకెల్లా ఎమోషన్‌ వుండేది మనిషికేనని, దాన్ని ఎప్పటికప్పుడు క్లియర్‌ చేసుకుంటే బాగుంటుందని నమ్మే వ్యక్తి అభి. తండ్రంటే ముగ్గురు కొడుకులకూ ఇష్టమే. ముఖ్యంగా అభికి తండ్రి అంటే ప్రేమ ఎక్కువ. అభి అన్నయ్యల దగ్గరే తండ్రి వుంటాడు. అభి మాత్రం జాబ్‌ రీత్యా మరో ప్లేస్‌లో వుంటూ వుంటాడు. ఒకరోజు తండ్రికి సీరియస్‌గా వుందని ఫోన్‌ రావడంతో బయల్దేరి తండ్రి దగ్గరికి వస్తాడు. తండ్రికి వచ్చిన జబ్బు వల్ల నెలరోజుల కంటే ఎక్కువ బ్రతికే అవకాశం లేదని తెలుస్తుంది. బాధపడుతున్న తండ్రిని ఓదారుస్తారు కొడుకులు. అప్పుడు ఆ తండ్రి ఓ నిజాన్ని కొడుకులకు చెప్తాడు. తన పేరు సుబ్రహ్మణ్యం కాదని, అసలు పేరు రమేష్‌చంద్ర ప్రసాద్‌ అని చెప్తాడు. పెద్ద బిజినెస్‌మేన్‌గా వున్న తనను కృష్ణమూర్తి(జగపతిబాబు) అనే వ్యక్తి మోసం చేసి ఇప్పుడు యూరప్‌లోనే పేరు మోసిన బిజినెస్‌ మేగ్నెట్‌ అయ్యాడని చెప్తాడు. నెలరోజుల్లో చనిపోతున్న తనకు అతనిపై పగ తీర్చుకోవాలని వుందని చెప్తాడు. దానికి రియాక్ట్‌ అయిన పెద్ద కొడుకు అతనిపై కేసు పెట్టి కోర్టుకి ఈడుస్తానని చెప్తాడు. 30 రోజులే టైమ్‌ వుండడం వల్ల తండ్రి చివరి కోరికను తీర్చేందుకు బయల్దేరతాడు అభి. యూరప్‌లోనే పెద్ద తలకాయ అయిన కృష్ణమూర్తిని ఫైనాన్షియల్‌గా దెబ్బతియ్యడానికి అభి ఎలాంటి పథకాలు వేశాడు? అతని దగ్గరికి ఎలా వెళ్ళాడు? కృష్ణమూర్తిపై పగ తీర్చుకోవాలన్న తండ్రి కోరికను అభి తీర్చగలిగాడా? అనేది మిగతా కథ .

నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌:
ఇప్పటివరకు అన్నిరకాల క్యారెక్టర్స్‌ చేసి మెప్పించిన ఎన్టీఆర్‌ ఈ సినిమాలో క్యారెక్టర్‌కి తగినట్టుగా సెటిల్డ్‌గా పెర్‌ఫార్మ్‌ చేశాడు. అవసరానికి మించి నటించే అవకాశం ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి లేదు. పాటల్లో ఎన్టీఆర్‌ స్టెప్పులు ఎప్పటిలాగే వున్నాయి తప్ప కొత్త మూమెంట్స్‌ ఏమీ కనిపించలేదు. హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌కి క్యారెక్టర్‌పరంగా ఈ సినిమాలో ఆమెకు అంతగా ఇంపార్టెన్స్‌ లేదనే చెప్పాలి. హీరోయిన్‌ వుండాలి కాబట్టి సోర్టీని కాస్త సాగదియ్యడానికి ఉపయోగపడుతుందని పెట్టినట్టు అనిపిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ పాటల్లోనూ, సెకండాఫ్‌లో విలన్‌ తండ్రికి హెల్ప్‌ చేసే కూతురిగా కనిపిస్తుంది. అభికి తండ్రిగా రాజేంద్రప్రసాద్‌కి పెర్‌ఫార్మ్‌ చేసే అవకాశం ఎక్కువ లేకుండా పోయింది. ఎందుకంటే సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి బెడ్‌మీదే కనిపించే అతని పెర్‌ఫార్మెన్స్‌ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. బిజినెస్‌ టైకూన్‌గా ఎప్పుడూ సూట్‌లో డిగ్నిఫైడ్‌గా కనిపించే విలన్‌గా జగపతిబాబు తన పెర్‌ఫార్మెన్స్‌తో మరోసారి ఎక్కువ మార్కులు కొట్టేశాడు. హీరో, విలన్‌ మధ్య వచ్చే సీన్స్‌లో చాలా చోట్ల ఎన్టీఆర్‌ని తన నటనతో డామినేట్‌ చేశాడు జగపతిబాబు. రాజీవ్‌ కనకాల పెద్ద కొడుకుగా ఫర్వాలేదు అనిపించాడు. రెండు, మూడు డైలాగులు తప్ప అంతా ప్రాధాన్యం లేని క్యారెక్టర్‌ చేశాడు అవసరాల శ్రీనివాస్‌, ఇక మధుబాల, తాగుబోతు రమేష్‌, నవీన్‌, ఆశిష్‌ విద్యార్థి ఓకే అనిపిస్తారు.

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌:
తన ప్రతి సినిమానీ టెక్నికల్‌గా మంచి స్టాండర్డ్స్‌లో తీసే సుకుమార్‌ ఈ సినిమాకి కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమా పూర్తిగా ఫారిన్‌లోనే కావడం వల్ల విజయ్‌ చక్రవర్తి మంచి ఫోటోగ్రఫీ కూడా సినిమాకి బాగా హెల్ప్‌ అయింది. ప్రతి సీన్‌ని నీట్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. సుకుమార్‌ ప్రతి సినిమాకీ సూపర్‌హిట్‌ పాటలు ఇచ్చే దేవిశ్రీప్రసాద్‌ ఈసినిమాకి కూడా ఆడియోపరంగా మంచి పాటలు ఇచ్చాడు. అయితే విజువల్‌గా రెండు పాటలే ఆకట్టుకున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఎప్పటిలాగే బాగానే చేశాడు దేవి. సుకుమార్‌ గురించి చెప్పాల్సి వస్తే పాత కథని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు పగ తీర్చుకోవడమనే కాన్సెప్ట్‌ కొత్తది కాదు. కానీ, దాని కోసం ఎంచుకున్న బ్యాక్‌డ్రాప్‌, స్క్రీన్‌ప్లే కొత్తగా వుండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే సీన్స్‌పరంగా సినిమాలో విసిగించేవి చాలా వున్నాయి. హీరోయిన్‌ని లైన్‌లో పెట్టడానికి హీరో వేసే ట్రిక్కులు స్టార్టింగ్‌లో కొత్తగా అనిపించినా రెండు మూడు సీన్స్‌ తర్వాత బోర్‌ కొట్టిస్తాయి. అంతేకాకుండా హీరోయిన్‌ మనసులో అనుకునేవి, కలలో వచ్చినవి హీరో చెప్పెయ్యడం విడ్డూరంగా అనిపిస్తుంది. హీరోయిన్‌ని కిడ్నాప్‌ చేసిన వాళ్ళను పట్టుకోవడానికి హీరో వేసే కాలిక్యులేషన్స్‌ ప్రేక్షకులకు చిరాకును తెప్పిస్తాయి. విలన్‌ అంతు చూడడమే ధ్యేయంగా వచ్చిన హీరో గురించి తెలుసుకున్న హీరోయిన్‌ అతన్ని దూరం పెట్టడంతో ఆమె ప్రేమకోసం పాకులాడడం, తనని ప్రేమించమని ప్రాధేయపడడం చాలా అసహజంగా అనిపిస్తుంది. అలాగే కృష్ణమూర్తి తన భార్యను డ్రగ్‌ కేసులో ఇరికించాల్సిన అవసరం అతనికి ఏం వుందో అర్థం కాదు. ఈ విషయాన్ని తర్వాత కూడా క్లారిఫై చెయ్యలేదు. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది మిస్సవడంతో స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఆడియన్స్‌ చాలా సీరియస్‌గా ఈ సినిమాని చూడాల్సి వస్తుంది.

విశ్లేషణ:
తండ్రి గతాన్ని తెలుసుకున్న కొడుకు విలన్‌పై పగ తీర్చుకోవడానికి బయల్దేరడం, అందుకోసం విలన్‌ కూతుర్ని లైన్‌లో పెట్టడానికి రకరకాల ట్రిక్కులు ప్లే చేయడం, చివరికి విలన్‌ దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్‌ చెయ్యడంతో ఫస్ట్‌ హాఫ్‌ ముగుస్తుంది. కొన్ని కొత్త సీన్స్‌తో, కొత్త స్క్రీన్‌ప్లేతో సినిమా ఫర్వాలేదు అనిపిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి అసలు కథను వదిలేసి హీరో, హీరోయిన్‌ మధ్య సీన్స్‌ పెంచడం, హీరోయిన్‌ తల్లి ఎక్కడుందో  తెలుసుకొని వాళ్ళిద్దరినీ హీరో కలపడం, మధ్య మధ్య ఫ్లోను అడ్డుకుంటూ పాటలు రావడంతో సినిమాను సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌ నుంచి ప్రీ క్లైమాక్స్‌ వరకు కొన్ని అనవసరమైన సీన్స్‌తో వెళ్ళి అక్కడి నుంచి కథలోకి వస్తాడు డైరెక్టర్‌. ఏ సినిమాలో అయినా హీరో అనుకున్నది సాధిస్తాడు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. తండ్రి చివరి కోరికను తీర్చడం కోసం ఎన్నో రిస్క్‌లు తీసుకొని విలన్‌ని రోడ్డున పడేస్తాడు. టి.వి.లో దానికి సంబంధించిన న్యూస్‌ తండ్రికి చూపించడంతో అతను తృప్తిగా తుదిశ్వాస విడుస్తాడు. సినిమా మొదలైన దగ్గర నుంచి ఎండ్‌ అయ్యే వరకు సినిమా అంతా సీరియస్‌గానే నడుస్తుంది తప్ప ఎక్కడా ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది కనిపించదు. మెయిన్ గా అర్ధం కాని విషయం ఏంటంటే పెయింటింగ్ లో రహస్య కెమెరా పెట్టి ఇవ్వడం, దాన్ని ప్రతి విషయాన్నీ ఆతి తెలివితో కనిపెట్టే జగపతి బాబు మచ్చలాంటి కెమెరా ను కనిపెట్టలేకపోవడం అన్నది విడ్డురం గా వుంది, ఒక వేళ కనిపెట్టకలేక పోయడనుకోండి ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం పెయింటింగ్ ని గోడకు పెట్టిన వెంటనే ఎన్టీఆర్‌ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి క్లైమాక్స్ వరకు టైం తీసుకోవాలా…అన్నది మరో ప్రశ్న.అలాగే ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే ఎలిమెంట్స్‌ కూడా సినిమాలో లేకపోవడంతో అందరూ సినిమాని సీరియస్‌గా చూసి సీరియస్‌గానే బయటికి వస్తారు. సుకుమార్‌ చేసిన గత చిత్రంలాగే ఈ సినిమా కూడా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశాలు తక్కువ. పండగ సీజన్‌ కావడం, పోటీగా మరో మూడు సినిమాలు కూడా వుండడం, ఇది రెగ్యులర్‌ సినిమా కాకపోవడం.. ఇన్ని కారణాల వల్ల ఈ సినిమా కమర్షియల్‌గా ఎలా నడుస్తుందో వేచి చూడాల్సిందే

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close