మంచు లక్ష్మి వెంకటేశ్వరస్వామికి తమ్ముడి కూతురేనంట!

హైదరాబాద్: ఇంగ్లీష్‌ భాషలో ‘నేమ్ డ్రాపింగ్’ అని ఒక ఫ్రేజ్ ఉంది. ఎదుటివారిని ఇంప్రెస్ చేయటంకోసం – ఫలానా ప్రముఖుడు మాకు బంధువనో, బాగా తెలిసిన వ్యక్తి అనో చెప్పటాన్ని నేమ్ డ్రాపింగ్ అంటారు. మోహన్‌బాబు కుమార్తె, సుప్రసిద్ధ తెలుగు నటి, నిర్మాత, టీవీ షో హోస్ట్ మంచు లక్ష్మీప్రసన్న ఈ విద్యలో పీక్స్‌కు చేరుకున్నారు. సాక్షాత్తూ ఏడుకొండలవాడితోనే బంధుత్వం కలిపేశారు.

ఇటీవల మంచు లక్ష్మి చెల్లెమ్మ(ఆ బాలగోపాలానికీ చెల్లెమ్మే) భర్త శ్రీనివాస్, కుమార్తెతో కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఎలాగైనా పేజ్ 3 సెలబ్రిటీ కదా, దర్శనం చేసుకుని బయటకు రాగానే మన మీడియా వాళ్ళు వెళ్ళిపోయి మాట్లాడమంటూ గొట్టాలు పెట్టారు. తనకు వెంకటేశ్వరస్వామి అంటే చాలా ఇష్టమని మంచు లక్ష్మి ముద్దు ముద్దుగా వచ్చీరాని తెలుగులో(?!?) చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత చెప్పిన విషయానికి అక్కడున్నవారందరూ, టీవీలలో చూసేవారందరూ ఢామ్మని పడిపోయారు. వెంకటేశ్వరస్వామిని తాను పెదనాన్నగా అనుకుంటూ ఉంటానని లక్ష్మి తెలిపారు. అయితే మనకు భగవంతుడితో ఏమైనా పని ఉంటే మోహన్‌బాబుగానీ, ఆయన కుటుంబసభ్యుల ద్వారా గానీ పైరవీ చేసుకోవచ్చన్నమాట! మంచు లక్ష్మి మాటలను చూడాలంటే ఈ క్రింద చూడొచ్చు.

https://www.youtube.com/watch?v=wezr0rR5nRA

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close