భాగమతి రివ్యు : పొలిటికల్ హర్రర్

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

భాగమతి సినిమాకు వెళ్లాలనుకునే వారికి ఓ సూచన. ఇది భాగమతి సినిమా కాదు. చంచల సినిమా. ఇందులో భాగమతి ది కామియో రోల్ మాత్రమే. ఇది దృష్టిలో పెట్టుకుని సినిమాకు వెళ్లాలి.

ఇన్నాళ్లు జరిగిన ప్రచారం, జనాలు ఎదురు చూసింది వేరు. సినిమాలో వున్నది వేరు.

మైసూర్ పాక్ లో మైసూరు వుండదు. ఆ మాటకు వస్తే మైసూర్ బజ్జీలో కూడా వుండదు. అయినా అవి ఇష్టమే. మైసూర్ లేదని తినడం మానేయరుగా. కానీ ముందుగా క్లారిటీ వుండాలి. భాగమతి సినిమాలో ముందుగా ఇవ్వనిది ఆ క్లారిటీనే. అందువల్ల ఆ క్లారిటీతోనన్నా సినిమాకు వెళ్లాలి. లేదా ఏ అంచనా లేకుండానైనా వెళ్లాలి. అప్పుడే భాగమతి నచ్చుతుంది. నచ్చే అవకాశం వుంటుంది.

కథ :

ఓ నిజాయతీగల రాజకీయ నాయకుడు ఈశ్వరప్రసాద్ (జయరాం). అతని పర్సనల్ సెక్రటరీ ఐఎఎస్ చంచల. ఈశ్వరప్రసాద్ సిఎమ్ పదవి సాధించడానికి వేరే పార్టీ పెట్టే అవకాశం వుంది, అతని పార్టీ హైకమాండ్ అతనిని ఏదో ఒక కేసులో ఇరికించాలని చూస్తుంది. అందుకోసం ఓ సిబిఐ అధికారిణి (ఆషా శరత్) ను పంపిస్తుంది. అప్పటికే చంచల తను ప్రేమించిన శక్తి (ఉన్ని ముకుందన్)ను హత్య చేసిన కేసులో జైలులో వుంటుంది. ఆమెను ఇంటరాగేట్ చేసేందుకు ఓ పాడుపడిన బంగ్లాలో వుంచుతారు. ఆ బంగ్లా భాగమతి అనే నైజాం కాలం నాటి రాణిది. అక్కడ, ఆ బంగ్లాలో చంచల చిత్ర విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొంటుంది. దాంతో ఆమెను మెంటల్ ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తుంది. అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ :

భాగమతి ఒక విధంగా వైవిధ్యమైన ప్రయత్నమే. ఇప్పటిదాకా హర్రర్ కామెడీని మిక్స్ చేస్తూ వస్తున్నారు. అలాంటిది, హర్రర్-పాలిటిక్స్ మిక్స్ చేసే యత్నం చేసారు. అదే విధంగా ఇప్పటి దాకా హర్రర్ సినిమాలను ఒక బడ్జెట్ పరిమితులకు లోబడి తీస్తూ వస్తున్నారు. అలాంటిది అరుంధతి ని అప్పట్లో 12 కోట్ల వ్యయంతో తీస్తే, ఇప్పుడు 35 కోట్ల వ్యయంతో భాగమతిని తీసారు. కేవలం నిర్మాణ వ్యయమే కాకుండా, సినిమా మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వర్క్ కాస్త ఉన్నతంగా వుండేలా చూసుకున్నారు. కానీ ఎక్కడ ఆలోచనలో తేడా వచ్చిందో, భాగమతి అంటూ ఇంత హడావుడి చేసిన వారు, ఆ క్యారెక్టర్ విషయంలో మాత్రం కాస్త కాదు, ఎక్కువగాన తక్కువగా ఆలోచించారు. ఒక విధంగా చెప్పాలంటే నేతి బీరకాయలో నెయ్యి అన్నట్లుగా, భాగమతిలో భాగమతి.

ఈ లోపాన్ని, విషయాన్ని పక్కన పెట్టి చూస్తే మాత్రం సినిమా ఫరవాలేదు అనే స్థాయికి తీసుకురాగలిగారు. తొలిసగం లో టిపికల్ స్క్రీన్ ప్లే ఏమీ వుండదు. సస్సెన్స్ ను కాస్త దాచిన ఫ్లాట్ నేరేషన్ నే వుంటుంది. ఇక్కడ దర్శకుడికి పెద్దగా కష్టం ఏమీ వుండదు. భారీ వ్యయంతో నిర్మించిన, భారీ బంగ్లాలో, విపరీతమైన శబ్దాలు చేస్తూ, జనాలను భయపెట్టడం తప్పిస్తే. అందువల్ల ఈ ఫస్ట్ హాఫ్ సులువుగానే పాస్ అయిపోతుంది. విశ్రాంతికి ముందు కచ్చపోసి చీరకట్టి, కత్తి చేతపట్టి, భాగమతి అడ్డా అంటూ తెరమీదకు అనుష్క విశ్వరూపం వచ్చేసరికి ప్రేక్షకులు ఫిదా అయిపోయి, ద్వితీయార్థం కోసం ఆశగా చూస్తారు.

అక్కడే దర్శకుడు కాస్త తప్పుదారి పట్టించాడు ప్రేక్షకులను. సాధారణంగా ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ట్విస్ట్ ఇస్తారు. కానీ సినిమా విశ్రాంతి తరువాత భాగమతి ఓ అరగంట అయినా ఏలుకుంటుంది అని అనుకుంటే, తూచ్..అదేం లేదు అంటూ ప్రేక్షకులకు ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. ద్వితీయార్థం లో తొలిసగం అంతా బంగ్లాలో రీరికార్డంగ్, అరుపులు, కేకలతో సరిపోతుంది. ఆ జోనర్ నచ్చేవాళ్లకు ఓకె కానీ, అక్కడ భాగమతిని ఏదో విధంగా చొప్పించగలిగితే మరింత బాగుండేది. కానీ దర్శకుడు అలా చేయకుండా నేరుగా స్క్రిప్ట్ కు కట్టుబడి వెళ్లిపోయాడు.

ఇక క్లయిమాక్స్ కు చేరుకున్నాక, అసలైన ట్విస్ట్ బాగుంది. అప్పటి దాకా జరిగింది విప్పడమూ బాగుంది. కానీ ఇక్కడ కూడా అదే సమస్య. కేవలం హర్రర్ జోనర్ ను ఇష్టపడేవారికి ఈ తరహా క్లయిమాక్స్ అంతగా నచ్చదు. కానీ టిపికల్ స్క్రీన్ ప్లే తో కూడిన సినిమా లు ఇష్టపడేవారికి నచ్చుతుంది. అందుకే దర్శకుడు ఒకటి రెండు క్షణాల ఎక్సెటెండెడ్ క్లయిమాక్స్ ను ఇచ్చి తృప్తి పరిచే ప్రయత్నం చేసాడు. అక్కడ ఎలాగూ వ్రత భంగం జరిగింది కనుక, హర్రర్ సినిమాలకు లాజిక్ లు అక్కర్లేదు కనుక, ఆ ఎక్సెటెండెడ్ క్లయిమాక్స్ ను మరో నిమషం పొడిగించి, అక్కడ మరొక్కసారి ఒరిజినల్ భాగమతిని చూపించి వుంటే ప్రేక్షకుడు సంతృప్తిగా ఇంటి దారి పట్టేవాడు. ఇప్పుడు ఎక్కడో కాస్త అసంతృప్తి.

నటీనటుల ప్రతిభ :

భాగమతిగా ఒక్క సీన్ నే చేసింది అనుష్క. కచ్చితంగా అది బాగుంది. చంచలగా ఆమె కొత్తగా చేసింది కానీ చేయడానికి కానీ లేదు. ఎన్నో సినిమాల అనుభవం ఆమెది. అన్ని సినిమాల్లో ఆమెను చూసిన అనుభవం ప్రేక్షకులది. జయరాం బాగా చేసాడు. మన ప్రేక్షకులకు కాస్త కొత్త కాబట్టి, ఆ పాత్రకు బాగా సెట్ అయ్యాడు. సిబిఐ ఆఫీసర్ గా ఆషా ఒకె. మిగిలిన వారి పాత్రలు నామమాత్రం.

సాంకేతిక వర్గం :

సినిమాకు సాంకేతిక సహకారం బాగా అందింది. మాధి సినిమాటోగ్రఫీ, రవీందర్ ఆర్ట్ డైరక్షన్, థమన్ సంగీతం ఈ మూడూ సినిమాకు కీలకంగా నిలిచాయి. బంగ్లా సెట్ ను విభిన్నంగా వేసారు. కేవలం ఓ పెద్ద బంగ్లా అని కాకుండా, డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసారు. మాధి కెమేరా వర్క్ బాగుంది. థమన్ రీరికార్డింగ్ కచ్చితంగా అస్సెట్ నే.

తీర్పు :

భాగమతిలో భాగమతి కోసం వెదకకుండా, ఓ సీరియస్ సినిమాను అలా చూసేందుకు సిద్దమైతే, ఈ సినిమాకు నిరభ్యంతరంగా వెళ్లొచ్చు.

ఫైనల్ పంచ్ :

భాగమతి కాదు చంచల

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పేర్ని నాని – ఇంకా వైసీపీ ఓడిపోలేదుగా !?

మాచర్లలో ఎంతో మంది హత్యకు గురి కావడానికి... మరెన్నో హత్యా ప్రయత్నాల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూంటే వైసీపీ కొత్త సిద్దాంతంతో తెరపైకి...

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close