పవన్ – త్రివిక్రమ్ మంచి స్నేహితులు. వీరిద్దరికీ ఉమ్మడి భక్తుడు నితిన్. ‘అ.ఆ’ చేశాక త్రివిక్రమ్‌తో తన బంధం మరింత బలపడింది. అప్పటి నుంచీ ‘గురూజీ.. గురూజీ’ అంటూ త్రివిక్రమ్‌కి గురువు స్థానం ఇచ్చాడు. అలాంటి నితిన్..తో పవన్, త్రివిక్రమ్‌లు కలసి ఓ సినిమా చేయడం.. నిజంగా నితిన్ అదృష్టమే. అందులోనూ…. తన 25వ సినిమా. ఇంతకంటే నితిన్‌కి ఏం కావాలి..??
పవన్ అంటే తనకెంత ఇష్టమో నితిన్ చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇప్పుడు త్రివిక్రమ్ అంటే ఎంతిష్టమో కాస్త వెరైటీగా చెప్పాడు. ”ఓ అబ్బాయి అయి ఉండి, మరో అబ్బాయికి బీటు కొట్టాలంటే… త్రివిక్రమ్‌కే కొడతా…” అని కాస్త వెరైటీ స్టేట్మెంట్ ఇచ్చాడు నితిన్. పోలిక కాస్త విచిత్రంగా ఉన్నా.. నితిన్ అభిమానమంతా ఆ మాటల్లో బయటపడిపోయింది. కాకపోతే.. ఈ వేడుకకి త్రివిక్రమ్ డుమ్మా కొట్టడమే కాస్త అంతృప్తిగా అనిపించింది. త్రివిక్రమ్ కూడా ఉండి ఉంటే.. ఛల్ మోహన రంగ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరింత కనుల విందుగా జరిగేదేమో. త్రివిక్రమ్‌ని, ఆయన మాటల్నీ నితిన్ ఎంత మిస్సయ్యాడో తెలీదుగానీ, త్రివిక్రమ్ ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా మిస్సయ్యారు.