ప్రొ.నాగేశ్వర్ : సుప్రీంకోర్టులో బీజేపీ విచిత్ర వాదనలు

కర్ణాటకలో యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడంపై కాంగ్రెస్, జేడీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై జరిగిన విచారణలో బీజేపీ విచిత్రమైన వాదనలు వినిపించింది. గవర్నర్‌కు యడ్యూరప్ప రాసిన లేఖల్లో తాను ఇతురులతో కలిసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆ ఇతరలెవన్నదానిపై… సుప్రీంకోర్టుకు… బీజేపీ తరపు లాయర్ స్పష్టత ఇవ్వలేకపోయారు. పైగా బలపరీక్షకు సమయం కావాలని…ధర్మాసనంపై పదే పదే ఒత్తిడి తెచ్చారు. పదిహేను రోజులు, పది రోజులు, వారం రోజులు.. కనీసం మరో మూడు రోజులు అంటూ…. వేలం పాటలా.. బీజేపీ తరపు న్యాయవాది రోహత్గీ సాగిన వాదన..దేశ ప్రజలందర్నీ ఆశ్చర్య పరిచింది. దీనికి న్యాయస్థానం అంగీకరించలేదు. మరో ఇరవై ఆరు గంటల్లో బలపరీక్ష నిర్వహించాల్సిందేనని ఆదేశించింది.

బీజేపీ తరపున ముకుల్ రోహత్గీ వాదన పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా సాగింది. పూర్తి మెజార్టీ ఉందనుకున్నప్పుడు.. పది, వారం, ఐదు, మూడు రోజులు అంటూ.. సమయం కోసం వెంపర్లాడటం ఎందుకు..?. మరో వైపు కాంగ్రెస్, జేడీఎస్ న్యాయవాది సింఘ్వి తాము ఏ క్షణమైనా బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని కోర్టు ముందు సంశయం లేకుండా స్పష్టం చేశారు. అయితే బీజేపీ తరపున న్యాయవాది రోహత్గీ.. ధర్మాసనం ఎదుట మరో విచిత్ర ప్రతిపాదన చేశారు. అదే బలపరీక్ష సీక్రెట్ ఓటింగ్ ద్వారా నిర్వహించాలని. నిజానికి దేశంలో ఏ అసెంబ్లీలో కానీ… పార్లమెంట్‌లో కానీ.. విశ్వాస పరీక్ష సీక్రెట్ ఓటింగ్ ద్వారా జరగలేదు. దీనికి కారణం… రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో ” పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం” ఉంది. దీని ప్రకారం పార్టీల విప్ ను ధిక్కరించిన వారిపై అనర్హతా వేటు పడుతుంది. ఈ విప్ ధిక్కరించారో లేదో తెలుసుకోవడానికి బహిరంగ ఓటింగ్ నిర్వహిస్తారు. కానీ కర్ణాటకలో ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా… వర్తించకుండా చేయాలని ..బీజేపీ తరపున న్యాయవాది రోహత్గీ వాదించారు. తమకు ఎక్కువ సమయం ఇచ్చి..సీక్రెట్ ఓటింగ్ నిర్వహిస్తే.. మరింత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకుంటామని సుప్రీంకోర్టును పర్మిషన్ అడగడం లాంటిదే ఈ వాదన.

ప్రమాణస్వీకారం చేసిన తర్వాత యడ్యూరప్ప విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. పోలీసు ఉన్నతాధికారుల బదిలీలతో… యడ్యూరప్ప… పరిస్థితిని తనకు సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే.. ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యేలకు తాయిలాలు ఇచ్చి.. బీజేపీకి అనుకూలంగా ఓటేయించుకునే అవకాశం ఉంది. కానీ అసలు తాను తప్ప కేబినెట్ మంత్రులే లేనప్పుడు.. అసలు ఎమ్మెల్యేలే ప్రమాణస్వీకారం చేయనప్పుడు… ఈ నిర్ణయాల వెనుక ఉన్నది దురుద్దేశమే కదా. అందుకే సుప్రీంకోర్టు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించింది. అదే సమయంలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే నియామకంపైనా సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. అసలు ప్రభుత్వమే మెజార్టీ నిరూపించుకోని సమయంలో.. ఆంగ్లో ఇండియన్‌ను హడావుడిగా నియమించడానికి యడ్యూరప్ప ప్రభుత్వం ప్రయత్నించింది. దీనిపైనా కాంగ్రెస్ – జేడీఎస్ కోర్టును ఆశ్రయించారు. ఈ నియామకాన్ని తక్షణం నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

“కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారాన్ని నిలబెట్టుకుంటాం.. తగినంత సమయం ఇవ్వండి. పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా అవకాశం ఇవ్వండి” అన్న సారాంశంలో సుప్రీంకోర్టులో బీజేపీ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. సీనియర్ న్యాయవాదిగా ఉన్న రోహత్గీ రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా ఇలాంటి వాదనలు వినిపించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఫలితాల తర్వతా కాంగ్రెస్ – జేడీఎస్ అనైతిక పొత్తు పెట్టుకున్నాయని వాదిస్తున్నారు. కానీ సంకీర్ణాల యుగంలో రెండు పార్టీల మధ్య పొత్తు అనైతికం కాదు. బీజేపీ కూడా అనేక రాష్ట్రాల్లో సిద్ధాంతపరంగా వైరుధ్యాలున్న పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది కూడా. ఏపీలో నిన్నామొన్నటి వరకు పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపి..ఇప్పుడు విమర్శించుకోవడం నైతికమా..?

కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదా అని బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివి చేసే.. కాంగ్రెస్ ఈ రోజు ఈ స్థాయికి పడిపోయింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన బీజేపీ..ఇప్పుడు కాంగ్రెస్‌ విధానాలనే అమలు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

నామా కేంద్ర మంత్రి – కాంగ్రెస్ కూటమి సర్కార్‌లోనా ?

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎవరితో ఉంటారో ఇంకా ప్రకటించలేదు ..కానీ ఆయన మాత్రం ఓ ప్లాన్ తో ఉన్నారు. నామా నాగేశ్వరరరావును కేంద్ర మంత్రిని చేయాలనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి...

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close