ప్రొ. నాగేశ్వర్: జాతీయ మహా కూటమి ఏర్పడనుందా..?

కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు దేశంలోని బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నీ హాజరయ్యాయి. ఇటీవలి కాలంలో ఇలా నేతలంతా కలసిన సందర్భం లేదు. దీన్ని బట్టి చూస్తే…2019 ఎన్నికలే లక్ష్యంగా జాతీయ మహాకూటమి ఏర్పుడుతుందన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ ఇదంతా సులువు కాదు. కాంగ్రెస్ సారధ్యంలో పని చేయడానికి ఇప్పటికి అనేక పార్టీలు సిద్దంగా లేవు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఏపీలో టీడీపీ.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌తో జతకట్టే అవకాశం లేదు. ఇలాంటి తేడాలు.. చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. కొన్ని పార్టీలు కాంగ్రెస్‌తో నేరుగా కలిసినా.. చాలా పార్టీలు మాత్రం కలిసే అవకాశం లేదు.

కాంగ్రెస్ లేకుండా మిగతా పార్టీలన్నీ ఓ కూటమిగా ఏర్పడే అవకాశం ఉంది. కానీ బీజేపీని ఓడించాలంటే.. కచ్చితంగా కాంగ్రెస్ సపోర్ట్ కావాల్సిందే. ఇప్పటికే దేశంలో దాదాపుగా 250 పార్లమెంట్ సీట్లలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నడుస్తోంది. మిగతా చోట్ల.. కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీజేపీతో .. మరికొన్నిచోట్ల రెండూ ప్రాంతీయ పార్టీలో ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ కారణంగా… బీజేపీని కాదని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి రావాలంటే కచ్చితంగా కాంగ్రెస్ ఉండాల్సిందే. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే కొన్ని రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు చాలా లాభం కలుగుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు పెట్టుకుంటే.. మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్-బీఎస్పీ-ఎస్పీ కూటమి ఆధిక్యత చూపిస్తుంది.

అయితే తాత్కాలిక ప్రాతిపదిన పొత్తులు పెట్టుకుని రాజకీయల లబ్దిపొందుదామంటే.. ఫలితాలు రావు. ప్రాంతీయ పార్టీలు ఏకమైనా బీజేపీ ఇబ్బందే. కానీ అది.. సామాజిక, ఆర్థిక , రాజకీయ సిద్దాంతాలు బలంగా లేకుండా.. చంచలంగా వ్యవహరిస్తే.. అది అంతిమంగా బీజేపీ బలపడటానికి కారణం అవుతుంది. బీజేపీని ఓడించాలంటే.. దీర్గ కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా ఓ వేదికను రూపొందించాలి. కాంగ్రెస్ అయినా.. కాంగ్రెస్ లేకుండా అయినా పార్టీలన్నీ.. బలమైన సిద్ధాంతాల మీద పునాదులు ఏర్పాటు చేసుకోవాలి.

బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కాస్త తగ్గి వ్యవహరిస్తోంది. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. బాధ్యత అంతా… జేడీఎస్ తీసుకుంది. ఎక్కడా కాంగ్రెస్ డామినేషన్‌కు ప్రయత్నించలేదు. తన తరపున ఏ పార్టీని కూడా ఆహ్వానించలేదు. జేడీఎస్ కోసమే … ప్రాంతీయ పార్టీ నేతలంతా వచ్చారు. వేదికపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలుంటారని.. కొన్ని ఇతర పార్టీల నేతలు.. సందేహాలు వ్యక్తం చేసినా.. పూర్తిగా జేడీఎస్ డామినేషన్ కాబట్టి.. చంద్రబాబు లాంటి నేతలు వచ్చారు. భవిష్యత్‌లో కూడా కాంగ్రెస్ డామినేషన్‌కు ప్రయత్నించకుండా.. ఇలాగే వ్యవహరిస్తే.. బీజేపీ అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంది. అంతిమంగా చెప్పాలంటే.. కాంగ్రెస్ సారధ్యంలో మాత్రం.. 2019కి ముందు మహా కూటమి ఏర్పాటయ్యే అవకాశం దాదాపుగా లేనట్లే. కొన్ని ప్రాంతీయ పార్టీలు కలసి కూటమిగా ఏర్పడే అవకాశం ఉండొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close