మహేష్ సినిమాకు కథానాయిక దొరకలేదట

సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం సినిమా తర్వాత మురుగదాస్ సినిమా చేస్తాడని తెలిసిన వార్తే.. అయితే ఏప్రిల్ లో మొదలవనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ప్రస్తుతం మురుగదాస్ కూడా అకిరా సినిమా షూటింగ్ లో ఉన్నాడు. మహేష్ మురుగదాస్ సినిమాలో కథానాయికగా కొద్దిరోజులు శ్ర్ద్ధద్ద కపూర్ అని, మరికొద్ది రోజులు పరిణితి చోప్రా అని హడావిడి చేశారు. మొన్నీమధ్య దీపికా పదుకునే పెరు కూడా వినపడ్డది.

కాని తాజాగా నేను శైలజా బ్యూటీ కీర్తి సురేష్ అంటున్నారు. అయితే ఇలా వదిలేస్తే మరెవరిని తీసుకొచ్చి ఈమె మహేష్ హీరోయిన్ అనేస్తారేమో అని ఆ సినిమా నిర్మాతలు.. మహేష్ సినిమాకు కథానాయిక విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చారు. మహేష్ సినిమాలో ఆమె ఉంది.. ఈమె ఉంది అని చెప్పేవారికి ఇదో షాకింగ్ న్యూస్ అయ్యింది. అయితే త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడిస్తామని అన్నారు.

పారాస్ జైన్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న మహేష్, మురుగదాస్ సినిమా బడ్జెట్టే 110 కోట్లను అంచనా వేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేసే విధంగా సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. సో ఇప్పటికైతే మహేష్ సినిమాకు కథానాయిక పోస్ట్ ఖాళీగానే ఉందన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

బ‌న్నీ చేతిలో ‘గాజు గ్లాసు’… ఏం సంకేతాన్ని ఇస్తోంది?

సినిమా వాళ్లు, అందులోనూ స్టార్ హీరోలు సెన్సిటీవ్‌గా ఉంటారు. తెర‌పై ఏం చేసినా, చెయ్యాల‌నుకొన్నా, ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచిస్తారు. 'ఇలా చేస్తే.. జ‌నంలోకి ఎలాంటి సంకేతాలు అందుతాయి' అనే లెక్క‌లు వాళ్ల‌కు చాలా...
video

పుష్ష‌రాజ్ పాట‌: ఈసారి’డ‌బుల్’ డోస్‌

https://youtu.be/EdvydlHCViY?si=lC6JccPjEh516Zs5 సుకుమార్ - అల్లు అర్జున్‌ క‌లిస్తే ఏదో ఓ మ్యాజిక్ జ‌రిగిపోతుంటుంది. వీరిద్ద‌రికీ దేవిశ్రీ‌, చంద్రబోస్ కూడా తోడైతే - ఇక చెప్పాల్సిన ప‌నిలేదు. 'పుష్ష‌'లో అది క‌నిపించింది. 'పుష్ష 2'లోనూ ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close