మే నెల్లో ర‌జ‌నీకాంత్ `క‌బాలి` విడుద‌ల‌

సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న సినిమా `క‌బాలి`. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ఆయ‌న‌ లుక్ కు ఇప్ప‌టికే చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. సాల్ట్ పెప్ప‌ర్ లుక్కుతో నోట్లో పైప్‌తో రాజ‌సంగా ర‌జ‌నీకాంత్‌ కూర్చున్న ఫ‌స్ట్ లుక్‌ స్టిల్‌కు స‌ర్వ‌త్రా పాజిటివ్ స్పంద‌న వెల్ల‌డైంది. పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెరకెక్కించిన క‌లైపులి.య‌స్‌.థాను ఈ సినిమాను అత్యంత భారీ వ్య‌యంతో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ షూటింగ్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. జ‌న‌వ‌రి 20 నుంచి ఈ షెడ్యూల్‌ను మ‌లేషియాలో తెర‌కెక్కిస్తున్నారు. ర‌జ‌నీకాంత్‌తో పాటు కీల‌క పాత్ర‌ధారులంద‌రూ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఫిబ్ర‌వరి 28 వ‌ర‌కు ఈ షెడ్యూల్ ఉంటుంది. దీంతో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. ఈ సినిమా గురించి నిర్మాత క‌లైపులి.య‌స్‌.థాను మాట్లాడుతూ “నేను చాలా మంది పెద్ద హీరోల‌తో ప‌నిచేశాను. కానీ ర‌జ‌నీకాంత్‌గారితో సినిమా చేయ‌డ‌మ‌నేది నా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నాను. ఇది నా లైఫ్ టైమ్ గుర్తుండిపోయే సినిమా. ఈ చిత్రంలో ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తుండ‌గా, చైనా సూప‌ర్‌స్టార్ విల్స‌న్ చౌ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఇప్పుడు మ‌లేషియాలో చేస్తున్న షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. మేలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. సంతోష్ నారాయ‌ణ్ స‌మ‌కూర్చిన బాణీల‌కు తెలుగులో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, చంద్ర‌బోస్‌, అనంత‌శ్రీరామ్ పాట‌ల‌ను రాస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాం“ అని చెప్పారు.

ర‌జ‌నీకాంత్‌, రాధికా ఆప్టే, థ‌న్సిక‌, కిశోర్‌, జాన్ విజ‌య్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు కెమెరా: ముర‌ళీ, సంగీతం: స‌ంతోష్ నారాయ‌ణ్‌, ఆర్ట్: రామ‌లింగం, ఫైట్స్: అన్బ‌రివు, మాటలు: సాహితి, పాట‌లు: సిరివెన్నెల‌, చంద్ర‌బోస్‌, అనంత‌శ్రీరామ్‌, మేక‌ప్‌: భాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: `దేవి-శ్రీదేవి` స‌తీష్‌, నిర్మాత‌: క‌లైపులి.ఎస్‌.థాను.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close