‘సాహో’లో 200 సీన్లు వున్నాయా?

సాధారణంగా సినిమాకి 72 సీన్లు వుంటాయని చెబుతుంటారు. అనాదిగా వస్తున్న లెక్క ఇదే! కొత్తతరం దర్శకులు వచ్చాక… సన్నివేశాల నిడివిని కుదించి, సీన్ల సంఖ్యను కొంచెం పెంచారని అనుకుందాం! ఎంత పెంచినా సినిమాలో రెండొందల సీన్లు పడతాయా? రెండున్నర గంటల సినిమాలో 242 సీన్లు అంటే… నిమిషానికి ఒక సన్నివేశం స్ర్కీన్‌పై వచ్చి వెళ్తుండాలి. హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టిన ఫొటో ప్రకారం అయితే… ‘సాహో’లో 242 సీన్లు కచ్చితంగా వుండి తీరాలి. అంతకన్నా ఎక్కువ వున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రభాస్‌ హీరోగా ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్‌ పతాకంపై ప్రమోద్‌, వంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. శ్రద్ధా కపూర్‌ ఈ రోజు సెట్స్‌లో జాయిన్‌ అయ్యారు. సీన్‌ నెం. 242, షాట్‌ నెం 1 తీస్తున్నార్ట! అప్పటికే నాలుగు టేకులు తీసినా సరిగా రాలేదు. ఐదో టేక్‌కి అందరూ సిద్ధమయ్యారు. ఇప్పటికే బడ్జెట్‌ భారీగా ఖర్చు చేశారని, నిర్మాతలు 300 కోట్టు ఖర్చు చేయడానికి సిద్ధంగా వున్నారని వినికిడి. హాలీవుడ్‌ రేంజ్‌లో సినిమా తీస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 2019లో విడుదల చేయాలనుకుంటున్నార్ట!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఓటుకు నాలుగు వేలు..!?

కుప్పం.. మంగళగిరి.. పిఠాపురం.. ఈ మూడు నియోజకవర్గాలపై వైసీపీ ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. కారణం అక్కడ చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ లు పోటీ చేస్తుండటమే. దీంతో వారిని ఎలాగైనా ఓడించాలని...

సజ్జల భార్గవ, వైసీపీ సోషల్ మీడియా టీంపై సీఐడీ కేసులు !

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారంటే ఏంటో వైసీపీ సోషల్ మీడియా, వాటి ఇంచార్జ్ సజ్జల భార్గవను చూస్తే అర్థమైపోతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీపై కేసులు...

ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట దక్కేనా..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించడంతో...

ఓటేస్తున్నారా ? : కోర్టు ధిక్కరణల పాలన గుర్తుకు తెచ్చుకోండి!

రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే ఆ ప్రభుత్వం ఎందుకు ?. గతంలో ఒక్క కేసులో కోర్టు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం రాజీనామా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close