జనసేనతో పొత్తు కోసం కామ్రేడ్ల ఆరాటం.. ! పవన్ స్పందనేది..? ‍

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల వ్యూహం… ఏమిటో అర్థం కాక వామపక్ష పార్టీలు టెన్షన్‌కు గురవుతున్నాయి. తమతో కలిసి పోరాటాలు చేస్తున్న పవన్ కల్యాణ్… వచ్చే ఎన్నికల్లో పొత్తులకు వస్తాడా లేదా అనేది వారికి పెద్ద మిస్టరీగా మారింది. పవన్ కల్యాణ్‌ తో పొత్తు కోసం వారు చేయని ప్రయత్నాలు లేవు. ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్ మనసును సంతోషపరిచేలా.. మంచి మాటలు చెబుతూనే ఉన్నారు. పవన్ నాయకత్వన్ని పొగుడుతున్నారు. పవన్ కల్యాణ్ గెలవబోతున్నాడని జోస్యాలు కూడా చెప్పుకొచ్చారు. కానీ పవన్ కల్యాణ్ నోటి వెంట ఇప్పటి వరకూ పొత్తులనే మాట బయటకు రాలేదు. అయినా జనసేన అధినేత నిర్వహించే ఎలాంటి కార్యక్రమానికైనా.. ఆహ్వానం ఉన్నా.. లేకపోయినా.. సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత మధు కచ్చితంగా హాజరవుతున్నారు.

కొద్ది రోజుల క్రితం… రాజకీయ ప్రత్యామ్నాయ వేదికగా.. కమ్యూనిస్టులు, జనేసన, లోక్ సత్తా సహా కలసి వచ్చే ఇతర పార్టీలన్నింటితో కలిసి మహాకూటమి ఏర్పాటు చేస్తున్నామని సీపీఐ నేత రామకృష్ణ ప్రకటించారు. పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్పష్టం చేశారు. అయినప్పటికీ జనసేవ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పవన్ పై ఒత్తిడి పెంచేందుకు ఇప్పుడు… సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రంగంలోకి దిగారు. ఏపీలో పవన్‌తో కలిసి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని ప్రకటించారు. ఇప్పటికే జనసేనతో కలిసే ఉద్యమాలు చేస్తున్నామని గుర్తు చేశారు. జనసేనతో తమ స్నేహం ఎన్నికల వరకు కొనసాగుతుందని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నారాయణ పెద్దగా కనిపించడం లేదు. జాతీయస్థాయిలో పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించిందని… అందుకోసం ఢిల్లీకి మకాం మారుస్తున్నానని ప్రకటించారు.

గత ఎన్నికల్లో వామపక్ష పార్టీలు… తెలంగాణలో ఉనికి చాటుకున్నా.. ఏపీలో మాత్రం పూర్తిగా తేలిపోయారు. ఎవరూ పొత్తులు పెట్టుకోకపోవడంతో.. ఒంటరిగా పోటీ చేశారు. ఎక్కడా డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. ఈ సారి అసెంబ్లీలో తమ ఉనికిని చాటుకోకపోతే.. భవిష్యత్ ఉండదని భయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీలు పొత్తులకు ముందుకు వచ్చే అవకాశాలు తక్కువే. అందుకే జనసేనపైనే వామపక్షాలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి.కానీ పవన్ మాత్రం వారిని వెయిటింగ్‌లో పెట్టారు. ఏమీ చెప్పడం లేదు. కానీ అప్పుడప్పుడు తాము 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెబుతూ షాక్ ఇస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close