వరుస సర్వేలన్నీ బీజేపీకి కొత్త మిత్రులను వెదికి పెట్టడానికా..?

భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గుతాయి కానీ.. మిత్రపక్షాలతో కలిసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమంటూ.. కొద్ది రోజుల నుంచి బీజేపీ అనుకూల మీడియా చానళ్లు రోజు మార్చి రోజు సర్వేలతో హోరెత్తిస్తున్నాయి. ఇవన్నీ దాదాపుగా అతిశయోక్తులకు దగ్గరగా ఉంటున్నాయి కానీ వాస్తవాలను ప్రతిబింబించం లేదు. ఏపీలో బీజేపీకి ఏకంగా ఏడు లోక్ సభ సీట్లు ఇచ్చేసిందో సర్వే. దీనికి తగ్గట్లుగానే ఇతర సర్వేలూ బయటకు వస్తున్నాయి. ఏపీ విషయంలో ప్రత్యేకంగా అంత ఘోరమైన సర్వే మళ్లీ రాలేదు కానీ.. ఓవరాల్ గా మాత్రం బీజేపీకి ఒకే రకమైన సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు. వరుసగా వస్తున్నఈ సర్వేల వెనుక బీజేపీ స్ట్రాటజీ ఉందన్న ప్రచారం ఢిల్లీ మీడియా వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి నిఖార్సైన మిత్రపక్షం లేదు. శివసేన ఎప్పుడో కటిఫ్ చెప్పింది. శివసేనతో కలిసి పోటీ చేయాలనుకుంటే.. బీజేపీ చాలా వదులుకోవాల్సి ఉంటుంది. ఇక బీహార్ లో జేడీయూతో కూడా అదే పరిస్థితి. ఈ రెండు రాష్ట్రాల్లో రాజీ పడితే.. బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం… ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అలాగే.. ఇతర చిన్నాచితకా మిత్రపక్షాలు కూడా.. బీజేపీ గెలిచే చాన్స్ ఉందంటేనే ఆలోచిస్తున్నాయి. ఏ మాత్రం తేడాగా ఉన్నా… బీజేపీకి జెల్ల కొట్టడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ పార్టీలను నిలుపుకోవడంతో పాటు.. కొత్త పార్టీలను ఎన్డీఏలోకి ఆకర్షించడానికే.. బీజేపీ ఇప్పుడు మళ్లీ గెలవబోతోందన్న ప్రచారాన్ని ప్రారంభించినట్లు భావిస్తున్నారు.

ఉత్తరాదిలో తగ్గిపోయే సీట్లను.. దక్షిణాదిలో బీజేపీ భర్తీ చేసుకోవాలనుకుంటోంది. అయితే అది సొంతంగా సాధ్యం కాదు. సీట్లు సాధించేవారిని మిత్రులుగా చేసుకోవడమే బీజేపీ ముందున్నప్రథమ కర్తవ్యం. తమిళనాడులో అన్నాడీఎంకే. ఒడిషాలో బిజూ జనతాదళ్, తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ బీజేపీ హిట్ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే ఈ పార్టీలన్నీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి భయపడుతున్నాయి. వారికి ధైర్యం చెప్పడానికి.. .. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నా…. పరిస్థితి తేడాగా ఉండదని చెప్పడానికే ఈ సర్వేలన్నీ వరుసగా బయటకు వదులుతున్నారన్న ప్రచారం ఉంది. అందుకే… ఇటీవలి కాలంలో వైసీపీ వైఖరిలో కొంత మార్పు కనిపిస్తోంది. ప్రత్యేకహోదా పై బీజేపీ మాట ఇస్తే.. ఆ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు మెల్లగా ప్రారంభిస్తున్నారు. అదే జరిగితే సర్వేల ఫలితం బీజేపీకి దక్కినట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’ సెట్లో గొడ‌వ జ‌రిగిందా?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్...

ఆ ప్రజాగ్రహ ఓటులోనే బూడిదయ్యారు జగన్ గారూ !

జగన్ రెడ్డి ఓడిపోయినా ఇసుమంత కూడా మారలేదని తనను వదిలి పోతున్న పార్టీ నేతల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. ఎవరు పోయినా పర్వాలేదని.. ప్రజల...

కుక్కలకు వల వేశారు.. కాంతి రాణా కోర్టుకెళ్లారు !

హీరోయిన్ జెత్వానీ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డెహ్రాడూన్ లో దాక్కుని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు....

బీజేపీ నేతలు మనుషులైతే చంద్రబాబును తిట్టాలి : జగన్

జగన్ రెడ్డి బీజేపీ నేతలకు పెద్ద టెస్టే పెట్టారు. బీజేపీ నేతలు .. మనషులు అయితే చంద్రబాబును తిట్టాలట. బహుశా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు .. తనకు గిలిగింతలు పెట్టడానికి అందరూ తిట్టారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close