కేరళ వరదలు జాతీయ విపత్తు కాదా..? మోడీ మౌనం ఎందుకు..?

కేరళ వరదల్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతో పాటు… కేరళపై సానుభూతి చూపే ప్రతి ఒక్కరూ… కేరళ వరదలను.. జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సైలెంట్ గా ఉంటుంది. కేంద్రం మౌనంతో… డిమాండ్ మరింతగా పెరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా.. ఇదే డిమాండ్ ను వినిపించారు. దక్షిణాదిపై కేంద్రం చూపిస్తున్న వివక్షకు … ఇదే అసలైన నిదర్శనం అన్న విమర్శలు వస్తున్నాయి. అయినా సరే కేంద్రం.. మాత్రం కేరళ వరదల విషయంలో ప్రస్తుత సాయానికే పరిమింత కావాలని దాదాపుగా నిర్ణయించుకుంది. అందుకే తీవ్రమైన ప్రకృతి విపత్తగా ప్రకటించి చేతులు దులుపుకుంది.

2013లో కేదార్ నాథ్ వరదలను, 2014లో వచ్చిన జమ్మూకశ్మీర్ వరదలను కూడా.. కేంద్ర జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించింది. కానీ అదే సమయంలో గతంలో బీజేపీ అధికారంలో … వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒడిషాలో… ఇంత కంటే భయంకరమైన వరదలొచ్చాయి. కానీ అప్పుడూ జాతీయ విపత్తుగా ప్రకటించలేదు. ఈ పరిణామాలన్నీ చూసుకుంటే.. దక్షిణాదిపై బీజేపీ వివక్ష చూపిస్తుందన్న అనుమానం అంతకంతకూ పెరుగుతుంది. జాతీయ విపత్తుగా ప్రకటిస్తే.. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి ఆయా రాష్ట్రాలకు నిధులు వస్తాయి. ఇలా వచ్చే నిధులన్నీ… వంద శాతం గ్రాంట్. కేంద్రానికి ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన పని ఉండదు. అలాగే… ఏ ఖాతాలోనూ సర్దుబాటు చేయడానికి కూడా అవకాశం ఉండదు. కానీ జాతీయ విపత్తగా ప్రకటించకపోయినా.. కేంద్ర హోం శాఖ రూ. 100 కోట్లు, ప్రధాన మంత్రి మోడీ రూ. 500 కోట్లు ప్రకటించారు. ఈ సొమ్ము స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి కేటాయిస్తారు. అంటే ఇవన్నీ కేంద్రం ఆయా రాష్ట్రాలు.. విపత్తులు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి కేంద్రం కేటాయించే సొమ్ము. ఆయా రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లేనప్పుడు మాత్రమే.. జాతీయ విపత్తుగా ప్రకటించి నిధులిస్తారని.. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లలో వరదలు వచ్చినప్పుడు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఆయా రాష్ట్రాలకు లేదని… కేంద్ర వర్గాల చెబుతున్నాయి. అందుకే జాతీయ విపత్తుగా ప్రకటించామని చెబుతున్నారు. కానీ… ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలపై మాత్రమే ఎందుకు వివక్ష చూపుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. కేంద్రం కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. జాతీయ విపత్తగా ఎందుకు ప్రకటించడం లేదో.. వివరణ ఇవ్వడం లేదు. ఆ స్థాయిలో సాయం చేస్తున్నామని మాత్రం చెప్పుకుంటోంది. కానీ… జాతీయ విపత్తగా ప్రకటిస్తే… కేంద్రంపై పడే అదనపు భారం ఏదో ఉండబట్టే… నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు సహజంగానే వస్తాయి. వస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం సైలెంట్‌గా ఉండిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close