హ్యాట్సాఫ్‌.. నాగ‌శౌర్య‌

సాధార‌ణంగా త‌మ సినిమా వ‌స్తోందంటే… ‘గ‌త సినిమా కంటే ఈ సినిమాలో ఇంకా పొడిచేశాం.. చించేశాం’ అని చెబుతుంటారు. తీరా చూస్తే… రిజ‌ల్ట్ తేడాగా ఉంటుంది. ఇలాంటి మాట‌ల్ని కూడా జ‌నం న‌మ్మ‌డం మానేశారు. అయినా స‌రే, ఉన్న‌ది ఉన్న‌టు మాట్లాడేవాళ్లు ఇండ్ర‌స్ట్రీలో క‌రువైపోయారు. యంగ్ హీరోలు కూడా… ఫాల్స్ ప్రెస్టేజీతో మాట్లాడ‌డం మొద‌లెట్టేశారు. ఇలాంటి త‌రుణంలో నాగ‌శౌర్య స్పీచ్‌.. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడే స్వ‌భావం ఆక‌ట్టుకుంది. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ‘న‌ర్తన‌శాల‌’. ఈనెల 30న విడుద‌ల అవుతోంది. ఈరోజు హైద‌రాబాద్ లో ప్రీ రిలీజ్ పంక్ష‌న్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నాగ‌శౌర్య స్పీచ్ ఆక‌ట్టుకుంది. ‘ఛ‌లో’లో ‘చూసీ చూడంగానే’ అనే పాట సూప‌ర్ హిట్ట‌య్యింది. ఆ సినిమా విజ‌యంలో ఆ పాట కూడా ఓ కీల‌క పాత్ర పోషించింది. అందుకే.. ఈ సినిమాకి సాగ‌ర్ మహ‌తిని సంగీత ద‌ర్శ‌కుడిగా తీసుకున్నాడు. ‘న‌ర్త‌న‌శాల‌’లోనూ మంచి పాట‌లు కుదిరాయి. అయితే.. ‘చూసీ చూడంగానే’ స్థాయిని మాత్రం అందుకోలేక‌పోయామ‌ని ఒప్పుకున్నాడు శౌర్య‌. ”అద్భుతాలు ఒకేసారి జ‌రుగుతాయి. మ‌ళ్లీ అలాంటి పాట కోరుకోవ‌డం కూడా మూర్ఖ‌త్వ‌మే అవుతుంది. అయినా స‌రే ట్రై చేశాం. ఆ స్థాయికి అందుకోలేక‌పోయినా.. దానికంటే ఓ మెట్టు కింద‌నుండే పాట‌లు చేశాం..” అని నిజాయ‌తీ చూపించాడు. ”ఈ సినిమా బాగోలేక‌పోతే చూడొద్దు. బాగుంటే మాత్రం ప‌దిమందికి చెప్పండి” అంటున్నాడు శౌర్య‌. ‘న‌ర్త‌న‌శాల‌’ టీజ‌ర్ల‌కు, పాట‌ల‌కూ మంచి స్పంద‌న వ‌స్తోంది. దానికి తోడు ఈవారం సోలో రిలీజ్ ద‌క్కింది. సినిమాపై కూడా పాజిటీవ్ బ‌జ్ న‌డుస్తోంది. సో.. ఇవ‌న్నీ ఈ సినిమాకి క‌లిసొచ్చే ఛాన్సులున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close