ఎన్నికల సమయంలో అమ్రపాలి కలెక్టర్‌గా ఉండకూడదా..?

తెలంగాణలో ఒకే సారి పదకొండు మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ముందస్తు కసరత్తులో భాగంగా.. అధికార ప్రక్షాళనలో ఇవి తొలి నిర్ణయాలు. ఇంకా పోలీసులు అధికారులు, రెవిన్యూ అధికారుల బదిలీలు పెద్ద సంఖ్యలో ఉండనున్నాయి. పది మంది కలెక్టర్లను కూడా మార్చారు. కొంత మందికి తిరిగి ఇతర జిల్లాల్లో కలెక్టర్లుగానే పోస్టింగ్ ఇచ్చారు. కానీ.. అనూహ్యంగా… వరంగల్ అర్బన్ కలెక్టర్ కాట అమ్రపాలిని బదిలీ చేశారు కానీ పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. చురుకైన అధికారిగా… పేరు తెచ్చుకున్న కలెక్టర్ అమ్రపాలి.. బదిలీ అవుతారని ఎవరూ అనుకోలేదు. కానీ ఆమె బదిలీ అవడమే కాదు..మరో చోట పోస్టింగ్ కూడా తెచ్చుకోలేకపోయారు.

ఎన్నికల సమయంలో కలెక్టర్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారు. వారే జిల్లా స్థాయి రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. అందుకే ముందస్తుగా అధికార పార్టీలు ఎన్నికల సమయంలో… తమకు అత్యంత నమ్మకస్తులైన వారినే.. కలెక్టర్లుగా నియమించుకుంటూ ఉంటాయి. ముందస్తుకు వెళ్లాలనుకున్న.. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే పని చేసింది. అయితే.. అమ్రపాలిపై .. ప్రభుత్వం ఎందుకు నమ్మకం కోల్పోయిందనేది.. ఎవరికీ అర్థం కావడం లేదు. బహుశా ఆమె..ఆంధ్రప్రాంతానికి చెందిన వారనే కారణంతో… కలెక్టర్ పోస్టు నుంచి తప్పించారన్న ప్రచారం తెలంగాణ అధికార వర్గాల్లో జరుగుతోంది. అమ్రపాలికి తర్వాత విడత ఉత్తర్వుల్లో ఏదో ఓ పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది.

వచ్చే రెండు, మూడు రోజలు పాటు.. తెలంగాణలో బదిలీల జాతర నడవనుంది. ఆలిండియా సర్వీసుల అధికారుల సర్వీసుల్లో అందరూ.. తెలంగాణ వాళ్లే ఉండరు. కానీ ఏపీ వాళ్లు ఉంటే.. మాత్రం.. టీఅర్ఎస్ తన వంతుగా దూరం పెట్టే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కేసీఆర్ ఏ చిన్న విషయాన్ని వదిలి పెట్టడం లేదు. అందుకే సిన్సియర్‌గా పేరున్న వారిని కాకుండా.. విధేయులుగా ఉన్న వారినే ప్రస్తుతం కీలక పోస్టుల్లో పెడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close