వాతలు పెట్టి వెన్న పూస్తున్న అరుణ్ జైట్లీ ..!

నడిచేది తను కాకపోతే.. ఢిల్లీ కూడా దగ్గరేనని అందరూ అంటారు. అరుణ్ జైట్లీ కూడా అంటారు. అన్నారు కూడా. పెట్రో ధరలను రాష్ట్రాలు తగ్గించడమే సులభమని ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. చాలా రోజుల నుంచి… పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు వంద రూపాయల దగ్గరకు వచ్చాయి. ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు పెంచిన ఎక్సైజ్ పన్నను తగ్గించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంత కాలం.. వినీవినట్లు వ్యవహరించిన అరుణ్ జైట్లీ.. ఇప్పుడు రూ. రెండున్నర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో రూపాయిన్నర కేంద్రం, మరో రూపాయి ఆయిల్ కంపెనీలు తగ్గిస్తాయి. రాష్ట్రాలు కూడా.. రెండున్నర రూపాయలు తగ్గించాలని జైట్లీ ఆదేశం లాంటి విజ్ఞప్తితో కూడిన సూచనలు కూడా చేశారు.

పెట్రోధరల తగ్గింపు నిర్ణయంతో కేంద్రంపై రూ.21 వేల కోట్ల భారం పడుతుందని… చెప్పుకొచ్చారు. కానీ అది భారం ఎందుకవుతుంది. ప్రజల నుంచి దోచే పన్నుల ఆదాయం మాత్రం తగ్గుతుంది. కానీ ఆయన దాన్ని భారంగా చెప్పుకుంటారు. అయినా దేశంలో అత్యధికంగా అంటే.. 21 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఎన్నికలు ముందు ఉన్న తీవ్ర వ్యతిరేకత ఎదుర్గొంటున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి మాత్రమే… ఒక్క రూపాయి తగ్గించారు. మరే బీజేపీ పాలిత రాష్ట్రం కూడా.. పన్నులు తగ్గించలేదు. కానీ… కేరళ, ఏపీ లాంటి రాష్ట్రాలు.. గతంలోనే కంత మేర తగ్గించాయి. కేంద్రం తగ్గింపులోనూ.. చాలా తేడా రాజకీయాలు చేస్తున్నారు. ఎక్సైజ్ పన్ను శాతం తగ్గిస్తేనే.. నికరంగా… పెట్రోల్, డీజిల్ పై పన్ను భారం తగ్గుతుంది. కానీ పన్ను శాతం కాకుండా.. ఇప్పుడున్న ధర మీద రెండున్నర రూపాయలు తగ్గిస్తే.. పెరిగే ధర పెరుగుతూనే ఉంటుంది.

ఎక్సైజ్ సుంకం శాతంలో మాత్రం మార్పు రాదు. ఈ తగ్గింపులన్నీ కంటి తుడుపు చర్యలే. ఏడాదికి ఒక్క పెట్రోల్,డీజిల్ ఉత్పత్తులపై రూ. మూడు లక్షల కోట్లను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేస్తోంది. నాలుగేళ్ల కిందట ఈ మొత్తం రూ. 70 వేల కోట్లకు అటూఇటుగానే ఉంటుంది. ఇంత భారీ మొత్తంలో వినియోగం పెరగలేదు… కేవలం పన్ను శాతం మాత్రమే మూడు వందల శాతం పెరిగింది. పెంచిన పన్నును తగ్గిస్తే.. కనీసం రూ. 15 వరకూ లీటర్ ధర తగ్గిపోతుంది. ఆ పని చేయకుండా.. వాతలు పెట్టి వెన్న పూసినట్లుగా.. రూ. రెండున్నర తగ్గించి పబ్లిసిటీ చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close