కేసీఆర్ ఎప్పుడూ విన‌లేదంటున్న రేవంత్‌..!

కేసీఆర్ ని పాల‌క ప‌క్షం నుంచి దించుతామ‌నే న‌మ్మ‌కం త‌నకు నూటికి నూరు శాతం ఉంద‌న్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ప్ర‌తిప‌క్షంగా ఆయ‌నే ఉండ‌బోతున్నార‌నీ, విప‌క్ష నేత‌గానైనా క్రియాశీల‌క పాత్ర పోషించాలంటే ఇప్ప‌టికైనా కేసీఆర్ తీరు మార్చుకోవాల‌న్నారు. ఆయ‌న‌కి కొంత నాలెడ్జ్ ఉంద‌నీ, గేట్లు తెరిచి విన‌డం మొద‌లుపెట్టాల‌నీ, కేసులు పెట్టుడు, లోప‌లేసుడు.. ఈ స‌మ‌యాన్ని కొంత త‌గ్గించుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చారు. ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రేవంత్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ కి ఇప్పుడే కాదు, మొద‌ట్నుంచీ వినే స్వ‌భావం లేద‌న్నారు రేవంత్ రెడ్డి.

ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఒక గొప్ప అవ‌కాశం కేసీఆర్ కి వ‌చ్చింద‌నీ, కానీ గ‌డ‌చిన నాలుగున్న‌రేళ్లు పాల‌నపై దృష్టి పెట్ట‌డం మానేసి, పార్టీ ఫిరాయింపులూ రాజ‌కీయ కక్ష సాధింపు చ‌ర్య‌ల‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టారు అన్నారు. గ‌డ‌చిన నాలుగున్న‌రేళ్ల‌లో ఆయ‌న చేసిందేదీ ఇప్పుడు అక్క‌ర‌కు రావ‌డం లేదన్నారు. త‌న వ్య‌క్తులను కాకుండా, బ‌య‌ట‌ వ్య‌క్తుల‌ను కూడా క‌లుస్తూ ఉంటే కేసీఆర్ కి మ‌రింత ప‌రిధి పెరిగేద‌న్నారు. నాలుగు గోడ‌ల మ‌ధ్య కేవలం త‌న వారితోనే కూర్చోవ‌డం వ‌ల్ల బ‌య‌ట ప్ర‌పంచంతో కేసీఆర్ కి క‌నెక్ష‌న్ తెగిపోయింద‌న్నారు. టీడీపీలో మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న శాఖ‌కే ప‌రిమితం, బ‌య‌ట‌కి వ‌చ్చాక ఉద్య‌మాలంటూ అప్పుడ‌ప్పుడూ మీటింగుల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యేవార‌న్నారు. అయితే, కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక త‌న పాత్ర మారిపోయింద‌ని ఆయ‌న గుర్తించ‌లేద‌న్నారు.

ఆ పాత్ర స‌రిగా పోషించ‌క‌పోవ‌డం వల్ల‌నే తామేం మాట్లాడినా అస‌హ‌నానికి గురౌతున్నార‌నీ, వినే ల‌క్ష‌ణం ఆయ‌న‌కి ఎప్పుడూ లేద‌న్నారు. త‌న‌కు న‌చ్చ‌క‌పోతే ఠ‌క్కున మీద ప‌డిపోయి ద‌బ‌ద‌బా కొట్టేసి పారిపోవ‌డ‌మ‌నే గెరిల్లా యుద్ధం అప్పుడు క‌రెక్టేన‌నీ, ఇప్పుడు కేసీఆర్ ప్ర‌జ‌ల్లో ఉన్నారు కాబ‌ట్టి తలుపు తెర‌వాల‌న్నారు. ప్ర‌జ‌ల గొంతు వినేందుకు స‌మ‌యం ఇస్తే.. చాలా స‌మ‌స్య‌లు వేగంగా ప‌రిష్కార‌మౌతాయ‌నీ, ఆ అవ‌కాశం కేసీఆర్ ఇవ్వ‌లేద‌న్నారు. ప్ర‌గతి భ‌వ‌న్ గేట్లు తెరిచి ప్ర‌జ‌ల‌ను, ప్ర‌తిప‌క్షాల‌ను, ప్ర‌జా సంఘాల‌ను లోప‌లికి రానిచ్చి చ‌ర్చ చేయ‌డం మొద‌లుపెడితే తెలంగాణకి మేలు జ‌రుగుతుంద‌న్నారు రేవంత్‌. కేసీఆర్ ను ఎప్పుడూ విమ‌ర్శించే రేవంత్ రెడ్డి.. ఆయ‌న గురించి ఇంత విశ్లేష‌ణాత్మ‌కంగా మాట్లాడ‌టం ప్ర‌త్యేకంగానే క‌నిపిస్తోంది. కేసీఆర్ తీరులో లోపాన్ని బాగానే ఎత్తి చూపారని చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close