హలో… షేర్… హీరోయిన్లకు డబ్బులే డబ్బులు!

తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్ద చిక్కు వచ్చింది. ఎవర్ని ఫాలో కావాలి.. ఎవరి కోసం ఏ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలియక తికమక పడుతున్నారు! స్మార్ట్‌ఫోనులు వ‌చ్చాక‌…అంతా యాప్స్ మ‌యమే. ఇప్పటివరకూ ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌…. సోషల్ మీడియాలో ఈ మూడిటి హవా ఎక్కువ నడిచింది. ఇప్పుడు వీటికి షేర్ చాట్, హలో యాప్స్ పోటీ ఇవ్వడానికి హీరోయిన్లను, సినిమా ప్రముఖులను ఆశ్రయించాయి. తమ యాప్స్‌ను ప్రమోట్ చేసే బాధ్యత హీరోయిన్లపై పెట్టాయి.

రాశీ ఖన్నా ‘హలో’ అంటోంది! తన గురించి, తన సినిమాల గురించి తెలుసుకోవడానికి ‘హలో’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోమ‌ని, అందులో త‌న‌ను ఫాలో అవ్వ‌మ‌ని అంటోంది! హీరోయిన్లు మెహరీన్, శ్రియ, రష్మిక మందన్న, మాళవికా శర్మ, మన్నారా చోప్రా, రష్మీ.. హీరోలు సందీప్ కిషన్, నవదీప్, నందు.. కమెడియన్లు ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాసరెడ్డి, రాహుల్ రామకృష్ణ, జబర్దస్త్ బ్యాచ్ ‘హలో యాప్’ను ప్రమోట్ చేస్తున్నారు.

సమంత ఏమో షేర్ చాట్ డౌన్‌లోడ్ చేసుకోమ‌ని, అందులో తనను ఫాలో అవ్వమని అంటోంది. తను షేర్ చాట్‌లో తెలుగులో మాట్లాడతానని ఒక వీడియో విడుదల చేసింది. తమన్నా, శృతి హాసన్, పూజా హెగ్డే, అనుపమా పరమేశ్వరన్ తదితరులు షేర్ చాట్‌ని ప్రమోట్ చేస్తున్నారు.

షాప్ రిబ్బన్ కట్ చేయడానికి ఎంతోకొంత డిమాండ్ చేసే హీరోయిన్లు… యాప్స్‌ను ఫ్రీగా ప్రమోట్ చేస్తారా? అందుకు తగిన డబ్బును వసూలు చేస్తున్నార్ట‌! తమ స్థాయిని బట్టి డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండిటి ద్వారా హీరోయిన్లకు డబ్బులే డబ్బులు వస్తున్నాయి. ప్రేక్షకులు కొత్త కొత్త యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.. వాళ్ల టైమ్‌పాస్ వాళ్ల‌ది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close