జగన్ దాడిపై విజయమ్మ ప్రెస్ మీట్, తన ప్రశ్నలివే!

జగన్ పై దాడి జరిగి రెండు వారాలకు పైగా అయింది. ఇప్పటి వరకు వైకాపా పార్టీ నేతలు తప్ప జగన్ కుటుంబం నుంచి దాడిపై ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు జగన్ తల్లి విజయమ్మ. ముందుగా జగన్ పై దాడి సంఘటనపై తెలుగుదేశం నేతలు స్పందించిన తీరు గురించి తీవ్రంగా విమర్శించారు విజయమ్మ. దాడి జరిగిన తర్వాత తమ కుటుంబాన్ని అవమానిస్తూ వారు మాట్లాడారు అన్న విజయమ్మ, నాలుగు నెలల క్రితమే ఒక పెద్దమనిషి ( నటుడు శివాజీ గురించి) జగన్ పై దాడి జరుగుతుందని చెప్పినప్పటికీ, అలా జరగకూడదని ప్రార్ధించడం తప్ప తాను చేయగలిగింది ఏమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆమె అడిగిన ప్రశ్నలు ఇవే.

దాడిచేసిన వ్యక్తి జగన్ అభిమాని అనడం పై:
దాడిచేసిన వ్యక్తి జగన్ అభిమాని అని, వైఎస్ వీరాభిమాని అని, తెలుగుదేశం పార్టీ ఆయన అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం పై స్పందిస్తూ, అతను నిజంగా జగన్ వీరాభిమాని అయితే, అన్ని నెలలుగా ఆ వ్యక్తి పనిచేస్తున్న ఎయిర్పోర్ట్ మీదుగానే జగన్ వెళ్తున్నప్పటికీ, ఎప్పుడూ జగన్ ను కలవడానికి, ఫోటో దిగడానికి ఆ వ్యక్తి ప్రయత్నించలేదని, జగన్ ని కలిసిన మొదటి సందర్భం లోనే ఆ వ్యక్తి జగన్ పై దాడి చేశారని విజయమ్మ అన్నారు. నిజంగా అభిమాని అయి ఉంటే అంతకు ముందు ఎప్పుడు ఎందుకు జగన్ ను కలవడానికి ప్రయత్నించ లేదు అని ప్రశ్నించారు.

జగన్ ఎందుకు థర్డ పార్టీ ఎంక్వయిరీ కోరుతున్నాడు అన్న విమర్శపై:
ఆ తర్వాత జగన్ ఎందుకు థర్డ పార్టీ ఎంక్వయిరీ కోరుతున్నాడు, అతనికి రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదా అంటూ తెలుగుదేశం నాయకులు చేస్తున్న కామెంట్లకు స్పందించారు విజయమ్మ. గతంలో పరిటాల రవి కేసులో చంద్రబాబు కూడా సిబిఐ ఎంక్వైరీ కోరిన విషయం గుర్తు చేశారు విజయమ్మ మరి అప్పుడు చంద్రబాబుకు రాష్ట్ర పోలీసులు పై నమ్మకం లేకనే అలా చేశారా అంటూ విజయమ్మ ప్రశ్నించారు. అదేవిధంగా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్నారని మరి ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చంద్రబాబు కొనసాగిస్తున్నారా అని విజయమ్మ ప్రశ్నించారు.

జగన్ పై దాడి చేసినవ్యక్తి రాసిన లేఖ పై:
అలాగే జగన్ పై దాడి ఘటన తర్వాత జగన్ అభిమాని అయిన వ్యక్తి రాసిన లేఖ పోలీసులు ప్రవేశపెట్టిన లే ఖ మీద కూడా విజయమ్మ ప్రశ్నలు సంధించారు. దాడిచేసిన వ్యక్తి ని అరెస్టు చేసిన పోలీసులు ఆయన వద్ద ఒక లేఖ దొరికిందని చెప్పారు. మరి ఆ లేఖను అప్పటికప్పుడే ఎందుకని మీడియాకు విడుదల చేయలేదు, ఆ లేఖ మీడియాకు విడుదల చేయడానికి అన్ని గంటల సమయం పోలీసులకు ఎందుకు పట్టింది? అలాగే ఆ వ్యక్తి జేబులో ఈ లేఖ దొరికిందని చెప్పిన పోలీసులు, ఆ లేఖపై మడతలు ఎందుకు లేవో చెప్పగలరా అంటూ విజయమ్మ ప్రశ్నల పరంపర కొనసాగించారు.

కోడి కత్తి కామెంట్ల పై:
అలాగే కోడి కత్తి అంటూ వస్తున్న వెటకారపు కామెంట్లపై కూడా విజయమ్మ స్పందించారు. సరే మీరన్నట్టు కోడి కత్తి అయినప్పటికీ, అదే కత్తి మెడ దగ్గర తగిలి ఉంటే ప్రాణాలకే ప్రమాదం కాదా అంటూ మీడియాను తిరిగి ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత కె భద్రత లేకపోతే, ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయని ఆవిడ ప్రశ్నించారు.అలాగే, జగన్ పై దాడి జరిగిన వెంటనే, ఎంక్వయిరీ చేయకుండానే, ఇది చేసింది జగన్ అభిమాని అంటూ డిజిపి ఎలా ప్రెస్ మీట్ పెడతారని విజయమ్మ ప్రశ్నించారు. అలాగే విచారణ అవసరం లేదని ముఖ్యమంత్రి ఎలా అంటారని విజయమ్మ ప్రశ్నించారు.

ఇప్పటికే రాజశేఖర రెడ్డిని కోల్పోయిన ఈ కుటుంబంలో, మరొకసారి కడుపుకోత మిగల్చ వద్దని ప్రాధేయపడ్డారు. చివరిగా, అన్నీ భరిస్తున్నాం, అన్నీ సహిస్తున్నాం అన్న విజయమ్మ, ప్రజలు దీనికి బుద్ధి చెబుతారని, దేవుడు అన్నీ చూస్తున్నాడు అని అన్నారు.

– జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close