పార్టీలు మారేవారు భావజాలం లేని నాయకులన్న పవన్..!

‘కులాల్నీ మతాల్నీ ప్రాంతాల్నీ స‌మానంగా చూడ‌గ‌లిగే శ‌క్తి ఉన్న‌వాడిని నేను’ అన్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. పిఠాపురంలో ఆయన మాట్లాడుతూ.. త‌న‌లో స్వార్థం లేద‌నీ, రాత్రికి రాత్రి ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని లేద‌న్నారు. ఎన్ని ద‌శాబ్దాలైనా ఒక మార్పు తీసుకుని రావాల‌నే ఆలోచ‌నా ధోర‌ణి ఉన్న‌వాడిని అని చెప్పుకున్నారు. త‌న‌కు ఓట‌మి భ‌యం లేద‌నీ, మార్పును తీసుకుని రాగ‌ల ఆలోచ‌నా బ‌లం ఉన్న‌వాడిన‌ని చెప్పారు.

2009లో కొత్త పార్టీ పెట్టిన చిరంజీవి దాన్ని ముందుకు తీసుకుని వెళ్ల‌లేక‌పోవడానికి కార‌ణం… కొద్దిమంది వ్య‌క్తులు అన్నారు ప‌వ‌న్. వారి ద‌గ్గ‌ర భావ‌జాలం లేద‌నీ, ఆయ‌న ప‌క్క‌న ఎమ్మెల్యేలుగా ఉన్న వ్య‌క్తులే వేరే పార్టీల‌కు వెళ్లిపోయారన్నారు. పార్టీని క‌లిసేశార‌న్నారు. దాంతో ఒక బ‌ల‌మైన మార్పును తీసుకొచ్చే స‌మ‌యం ఆరోజున పోయింద‌న్నారు. కానీ, ఈసారి జ‌న‌సేన‌లో ఏ స్థాయి నాయ‌కులు అవ‌క‌త‌వ‌క‌లు చేసినా వాటిని అధిగ‌మించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌న్నారు. తాను నాయ‌కుల ఇగోల‌ను స‌ర్దుబాటు చెయ్య‌న‌నీ, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌కు మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇస్తాను అన్నారు. ఎవ‌రో లేక‌పోతే పార్టీ న‌డ‌వ‌దు అనే ప‌రిస్థితిలో జ‌న‌సేన ఉండ‌ద‌న్నారు. ఆ త‌రువాత‌, మ‌ళ్లీ కులాల టాపిక్ ఎత్తుకున్నారు. టీడీపీ నేత‌లు కులాల పేరుతో విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నీ, కులాల ఐక్య‌త కోస‌మే జ‌న‌సేన ఉంద‌న్నారు. న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మీద‌, మంత్రి నారా లోకేష్ మీదా విమ‌ర్శ‌లు చేశారు.

పార్టీ మారే వారిని భావ‌జాలం లేని నాయ‌కులు అన్నారు ప‌వ‌న్‌. మ‌రి, ఇప్పుడు జ‌న‌సేన‌లోకి వ‌చ్చి చేరిన‌వారు కూడా ఏదో ఒక పార్టీ నుంచి వ‌చ్చిన‌వారే క‌దా! పవన్ ద్రుష్టిలో ఇది చేరికలు కావొచ్చేమోగానీ.. వారి ద్రుష్టిలో అది పార్టీ మారడం మాత్రమే. ఇంకోటి… ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి కొంత‌మంది నాయ‌కులు వేరే పార్టీకి వెళ్లి, ఆ పార్టీని వేరే పార్టీలో క‌లిపేశార‌న‌డం మ‌రీ ఆశ్చ‌ర్య‌క‌రం. ఎందుకంటే, ఒక పార్టీ నుంచి నాయ‌కులు బ‌య‌ట‌కి వెళ్తున్నారంటే ఒకే ఒక్క కార‌ణం ఉంటుంది. నాయ‌క‌త్వం మీద‌, పార్టీ భవిష్య‌త్తు మీద న‌మ్మ‌కం స‌డిలితే ఏ పార్టీలోనూ నాయ‌కులు ఉండ‌రు. నాయకుల్లో భావజాలాన్ని బలంగా నిలబెట్టాల్సి ఉంచాల్సిన బాధ్యత అధినేతదే అవుతుంది. లేదంటే ఎవరి దారి వారు చూసుకుంటారు. గ‌త ఎన్నిక‌ల త‌రువాత ఆంధ్రాలో కాంగ్రెస్ నేత‌ల ప‌రిస్థితి ఇదే, తెలంగాణ‌లో టీడీపీ నేత‌ల వ‌ల‌స‌ల‌కూ కారణం ఇదే. అప్పుడు ప్రజారాజ్యం విష‌యంలోనూ జ‌రిగింది కూడా అచ్చంగా ఇదే. ప్ర‌జారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిందెవ‌రో ప్ర‌జ‌లు మ‌ర‌చిపోలేదే..! ఇంకోటి… ప‌ద‌వుల ఆశ‌తో త‌న పార్టీలోకి చేరొద్ద‌ని పిలుపునిస్తున్నారు ప‌వ‌న్‌. ‘నాకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ వ‌ద్దు, ఏ ప్రయోజనాలూ వద్దు, కేవ‌లం సేవ కోస‌మే వ‌చ్చాను’ అని పార్టీల్లో చేరేవారు ఎంత‌మంది ఉంటారు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెరిగిన రేవంత్ క్రేజ్…పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం

లోక్ సభ ఎన్నికల్లో చార్ సౌ పార్ నినాదం వెనక అసలు ఎజెండా రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు అంటూ బీజేపీని జాతీయస్థాయిలో ఇరకాటంలోకి నెట్టిన రేవంత్ సేవలను దేశవ్యాప్తంగా వాడుకోవాలని ఆ పార్టీ...

కవిత బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు..

లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై సోమవారం తీర్పు వెలువరించనుంది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ కేసులో తనను ఈడీ, సీబీఐలు అక్రమంగా అరెస్ట్ చేశాయని, తనకు బెయిల్...

నేడు ఏపీలో ప్రధాని పర్యటన..వైసీపీని టార్గెట్ చేస్తారా.?

సోమవారం ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 : 30 గంటలకు...

ఓటేస్తున్నారా ? : మీ పిల్లలు బానిసలుగా బతకాలనుకుంటున్నారా ?

ఊరంటే ఉపాధి అవకాశాల గని కావాలి. మనం ఊళ్లో బతకాలంటే పనులు ఉండాలి. ఆ పనులు స్థాయిని బట్టి రియల్ ఎస్టేట్ పనుల దగ్గర నుంచి సాఫ్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close