కాంగ్రెస్‌లోకి ఇద్దరు ఎంపీలు, ఓ ఎమ్మెల్సీ..! రేవంత్ చెప్పింది నిజమే..!?

కొడంగల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు… రేపోమాపో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు… వారిని ఆపే సత్తా ఉంటే ఆపుకోవాలని సవాల్ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారేమోనన్న అనుమానం కూడా వచ్చింది. కానీ నిజంగానే ఇద్దరు ఎంపీలు, ఓ ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ఆ ఇద్దరు ఎంపీల్లో ఒకరు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరొకరు… సీతారాం నాయక్. పార్టీ మారే ఆలోచనలో ఉన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి. ఈయన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ప్రధాన అనుచరునిగా కొనసాగుతున్నారు.

చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చాలా కాలంగా టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్నారు. రెండు నెలల నుంచి టీఆర్ఎస్ నేతలంతా ప్రచారంలో పరుగులు పెడుతున్నా… కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాత్రం.. ఎక్కడా కనిపించడం లేదు. ప్రచారం చేయడం లేదు. కానీ తన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఎక్కడా కారు గుర్తుకు ఓటేయమని చెప్పడం లేదు. ఆపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి పార్టీలో ఇస్తున్న ప్రాధాన్యతపై విశ్వేశ్వర్‌రెడ్డికి అభ్యంతరాలున్నాయి. రేవంత్ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన తాండూరులోనే ఉన్నారు. అక్కడ మీడియా పార్టీ మార్పుపై ప్రశ్నిస్తే.. ఇద్దరు కాదు.. ముగురు కాంగ్రెస్‌లో చేరుతారంటూ వ్యాఖ్యానించి వెళ్లిపోయారు. అంతే కాదు.. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో.. టీఆర్ఎస్ అన్ని స్థానాల్లోనూ ఎదురీదుతోందని ప్రకటించారు.

మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తేలిపోయింది. ఆయనకు ఈ సారి టిక్కెట్ లేదని.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారట. మహబూబా బాద్ నుచి పోటీకి… కేరళ క్యాడర్ కు చెందిన ఐపీఎస్‌ అధికారి లక్ష్మణ్‌ నాయక్‌ను టీఆర్‌ఎస్‌ ప్రోత్సహిస్తోంది. మహబూబాబాద్‌ ఎంపీగా కాంగ్రెస్‌ నుంచి గతంలో పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ ఈసారి మహబూబాబాద్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ సారి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి.. అవకాశం వస్తుందని సీతారాం నాయక్ నమ్కంతో ఉన్నారు. వీరందరూ.. ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు సోనియా వచ్చిన సమయంలో పార్టీలో చేరుతారని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఇద్దరు ఎంపీలు అధికార టీఆర్‌ఎస్‌ను వీడటం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close