తెలంగాణ ఎన్నికలు, రెబల్స్ బెడద

తెలంగాణ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా కాక పుట్టిస్తున్నాయి. అయితే టికెట్ల కేటాయింపు అన్ని పార్టీలలోనూ పెద్ద సమస్యగా మిగులుతోంది. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది హఠాత్తుగా కండువా మార్చేస్తే, కొందరు మాత్రం రెబెల్స్ గా పోటీ చేసి తీరతామని సవాలు విసురుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై వారి వారి కార్యకర్తలతో భేటీ అవుతున్నారు.

ఈ విషయంలో టిఆర్ఎస్ పరిస్థితి కాస్త మెరుగ్గా నే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టికెట్లు కేటాయించడం, అందరికంటే ముందే సీట్లు ప్రకటించడం ఆ పార్టీ కి కలిసి వచ్చింది. అయితే ఆ పార్టీలో కూడా సమస్యలు లేకపోలేదు. టిఆర్ఎస్ కు చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ రాజీనామా చేస్తోంది. చొప్పదండి టికెట్ తనకు కేటాయించకపోవడం తో పార్టీపై అలిగిన శోభ, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరనుంది. బిజెపి టిక్కెట్ తో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనుంది. గతంలో బాబు మోహన్ కూడా ఇదే లా చేసి ఉన్నాడు.

ఇక కూటమి లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ లో మాత్రం ఈ రెబెల్స్ బెడద తీవ్రంగా ఉంది. ఖైరతాబాద్ టికెట్ దాసోజు శ్రవణ్ కి కేటాయించడంతో ఖైరతాబాద్ కాంగ్రెస్ నేత రోహిణి రెడ్డి తెర మీదకు వచ్చింది. దాసోజు శ్రవణ్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, కానీ ఆయనను బలిపశువును చేయడానికి పార్టీ ఆ స్థానాన్ని కేటాయించిందని, పార్టీ ఈ విషయంలో పునరాలోచించుకోవాలని, తనకు టికెట్ రాకపోతే రెబల్ గా పోటీ చేయడం ఖాయమని ప్రకటించింది.

ఇక మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ది కూడా ఇదే పరిస్థితి. పార్టీలో సీనియర్ నేత గా ఉండి, ఒకప్పుడు పిసిసి అధ్యక్షుడు గా పనిచేసి ఇప్పుడు తన టికెట్ కోసం పోరాటం చేయవలసిన పరిస్థితి లో ఉన్నాడు ‌. ఆయన పార్టీ హైకమాండ్పై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్న ప్పటికీ, ఆయన అనుచరులు మాత్రం టికెట్ రాకపోతే కాంగ్రెస్ రెబల్గా ఆయన పోటీ చేస్తారని అంటున్నారు.

ఇక మంచిర్యాలలో టికెట్ రాని అరవింద రెడ్డి, కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరే అవకాశం కనిపిస్తోంది. అలాగే కోదాడ టికెట్ రాకపోవడంతో బొల్లం మల్లయ్య యాదవ్ టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లబోతున్నారు. అలాగే మహాకూటమిలో టికెట్ వచ్చే అవకాశం కనిపించకపోవడంతో, కార్యకర్తలతో భేటీ అయ్యారు సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి. అయితే ఈయన కూడా రెబల్ గా పోటీ చేస్తాడా అన్న విషయంపై స్పష్టత లేదు.

అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించిన స్థానాలలో మాత్రమే కాకుండా, మహాకూటమిలోని ఇతర పార్టీలకు టికెట్లు వదులుకున్న స్థానాలలో కూడా రెబల్స్ బెడద గట్టిగానే ఉంది. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎప్పటినుంచో పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ ఈసారి కూడా కాంగ్రెస్ టిక్కెట్ ఆశించారు. అయితే ఈ స్థానం కాస్తా పొత్తులో భాగంగా టీడీపీ కి వెళ్ళింది. దీంతో తాను కూడా రెబెల్ గా పోటీ చేస్తానని అంటున్నాడు ఈ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే.

శేర్లింగంపల్లి స్థానంలో పోటీ చేయనున్న టిడిపిలో కూడా ఇదే సమస్య ఉంది. పైసా వసూల్ నిర్మాత భవ్య ప్రసాద్, తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి ఉన్న నేత మొవ్వ సత్యనారాయణ మధ్య ప్రచ్చన్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొవ్వ కూడా తెలుగుదేశం పార్టీ రెబల్ గా పోటీ చేసే అవకాశం ఉందని ఆయన కార్యకర్తలు అంటున్నారు.

అలాగే ఖైరతాబాద్ స్థానాన్ని పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని తెలుగుదేశం కార్యకర్తలు ఏకంగా టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. కూకట్పల్లిలో మందాడి, పెద్దిరెడ్డి మధ్య పోటీ నడుస్తోంది. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు రెబల్ గా పోటీ చేసే అవకాశం ఉంది.

మొత్తానికి ఎంతమంది బి ఫాం తెచ్చుకుంటారు, ఎంతమంది రెబల్ గా పోటీ చేస్తారు అన్నది కొద్దిరోజుల్లో స్పష్టత రానుంది. అయితే ఈ రెబల్స్ ఎంతవరకు ప్రభావం చూపుతారు అన్నది ఎన్నికల ఫలితాలు వచ్చాకే తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close