తెలంగాణ ప్రచారంలో మోదీ చంద్రబాబు ప్రస్తావన ఎందుకు తేలేదు..?

తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఓటమి ముంగిటకు చేర్చింది మహాకూటమి. ఈ కూటమి మాస్టర్ మైండ్ చంద్రబాబు. కానీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో.. ప్రధాని నరేంద్రమోదీ.. చంద్రబాబు ప్రస్తావన తీసుకు కారాలేదు. బీజేపీయేతర కూటమికి చంద్రబాబునాయుడు ఓ రూపు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇది జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం అవుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రధానంగా.. ఈ కమిటి ఎంత భారీగా ఉంటుందో నిర్దేశించబోతున్నాయి. అందుకే మోదీ, అమిత్ షాలు వ్యూహాత్మకంగా.. కూటమి పేరు ప్రస్తావించడం తగ్గించారు. ఆ కూటమికి తమంతట తాము ప్రచారం ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న జాతీయ కూటమికి మొదటి అడుగు తెలంగాణలో పడింది.తెలంగాణలో మహాకూటమికి అనుకూల ఫలితం వస్తే.. జాతీయ రాజకీయాలను కూడా మలుపు తిప్పినట్లే అవుతుంది. కాంగ్రెస్ తో కూడిన బీజేపీయేతర కూటమి… ఏర్పాటు శరవేగంగా సాగుతుంది.

జాతీయ రాజకీయాల్లో ప్రతీసారి ఓ విభిన్న పరిస్థితి ఉంటుంది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా… జాతీయ రాజకీయాలకు వచ్చే సరికి.. బీజేపీనో.. కాంగ్రెస్ నో ఎంచుకోవాల్సి ఉంటుంది. సహజంగా.. ఇలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీలు.. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదన్న అంచనా వేసుకుని..అలాంటి పార్టీతో ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. గత ఎన్నికలకు ముందు బీజేపీకి అలాంటి ఇమేజ్ ఉంది. ఈ సారి పరిస్థితి మారింది. కానీ ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ తో నడవడానికి తటపటాయిస్తున్నాయి. కాంగ్రెస్ బలపడితేనే.. అధికారంలోకి వస్తుందన్న సూచనలు వస్తనే .. .వారు కూటమిలోకి వస్తారు.రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు సానుకూల వాతవరణం ఉందని సర్వేలొచ్చాయి. ఇక మిగిలింది తెలంగాణ.. తెలంగాణలో అశల్లేవనుకున్న పరిస్థితి నుంచి కూటమి ద్వారా.. రేసులోకి వచ్చి పోరాడుతోంది. ఇక్కడా సానుకూల ఫలితం వస్తే.. ఇక కూటమి ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.

ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికే.. మోదీ, అమిత్ షాలు వ్యూహాత్మకంగా.. కూటమిని గుర్తించనట్లుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గెలుపోటములు ఏవైనా కాంగ్రెస్ .. ఖాతాలో వేస్తే ప్రభావం తక్కువ ఉంటుందని అంచనా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలపై తెలంగాణ ప్రభావం ఉండకుండా.. వీలైనంతగా… తెలంగాణకే పరిమితం చేస్తేనే.. రాబోయే రోజుల్లో చంద్రబాబు చేస్తున్న కూటమి ప్రయత్నాలను.. వీలైనంతగా అడ్డుకట్టవేయగలమనేది… బీజేపీ అగ్రనేతల వ్యూహమని అంచనా..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close