ఆదిలాబాద్ జిల్లా రివ్యూ : స్వతం‌త్రులు బలంగా మారడానికి కారణం ఏమిటి..?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా టిఆర్ఎస్-బిజేపి అన్ని చోట్ల, కూటమి తరపున కాంగ్రెస్ 9 స్థానాల్లో, మరో స్థానంలో సీపీఐ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెజార్టీ నియోజకవర్గాల్లో వీరి మధ్యే పోటీ ఉంది. అయితే బోథ్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారుతున్నాయి. టిఆర్ఎస్-కాంగ్రెస్ అభ్యర్థులకు ధీటుగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి అనిల్ జాదవ్ దూసుకుపోతున్నారు. నామినేషన్ వేసినప్పటి నుంచి ఆయనకు అనుకూలంగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. రెండు సార్లు ఇక్కడి నుంచే అనిల్ జాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఎలాగైనా గెలుస్తారని ఆయన భావించగా…టికెట్ దక్కలేదు. దీంతో స్వంతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ప్రారంభంలో అనిల్ జాదవ్ తో పెద్దగా నష్టం ఉండదని టిఆర్ఎస్-కాంగ్రెస్ అభ్యర్థులు భావించారు. అయితే గతంలో ఓడిపోయిన సానుభూతికి తోడు అన్ని వర్గాల నుంచి అనిల్ కు అనూహ్య మద్దతు లభించడం రాజకీయంగా పరిస్థితులు మారిపోయాయి.

చాలా గ్రామాల్లో ప్రజలు భారీగా నగదును విరాళాలు ఇవ్వడంతో పాటు రోజూ వందల సంఖ్యలో జనం ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఒక స్వతంత్ర అభ్యర్థి గ్రాఫ్ అమాంతంగా పెరగడంచర్చనీయాంశమవుతోంది. పైగా తెలంగాణలో గెలిచే స్వతంత్రుల్లో బోథ్ అభ్యర్థి అనిల్ జాదవ్ ఉన్నారంటూ ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేసిన ప్రకటనతో అనిల్ జాదవ్ .. ఇక ఎమ్మెల్యే అయిపోయినట్లుగానే పరిస్థితి మారింది. వివిధ పార్టీలకు చెందిన వారితో పాటు తటస్థులు స్వచ్చందంగా మద్దతు ప్రకటిస్తున్నారు. పోటీదారిలిద్దరూ… గతంలో ఎమ్మెల్యేలుగా చేసి ఉండటంతో ప్రత్యామ్నాయంగా అనిల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు చర్చ సాగుతోంది.

బెల్లంపల్లి నియోజకవర్గంలో మరో రకమైన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి గడ్డం వినోద్ టిఆర్ఎస్-సిపిఐ అభ్యర్థులను కలవరపెడుతున్నారు. చెన్నూరు టిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ వినోద్ చివరి నిమిషంలో బిఎస్పీ అభ్యర్థిగా బెల్లంపల్లి బరిలో నిలిచారు. మాజీ మంత్రి అయిన వినోద్ కూడా గెలుస్తారని లగడపాటి ప్రకటించారు. ఆయన నామినేషన్ వేయకముందే చాలా మంది టిఆర్ఎస్ నేతలు ఆయనకుమద్దతుగా నిలిచారు. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మునిసిపల్ చైర్ పర్సన్ స్వరూప, ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు వినోద్ కు మద్దతు ప్రకటించారు. ప్రచారం కూడా చేస్తున్నారు. వీరిని టీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించినా… పట్టించుకోలేదు. మరో వైపు సీట్ల సర్ధుబాటులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని సిపిఐకి కేటాయించడంతో కాంగ్రెస్ లోని ఓ వర్గం అలిగింది. మాజీ మునిసిపల్ చైర్మన్ సూరిబాబు వర్గం కూడా వినోద్ కు బాసటగా నిలిచింది. టిఆర్ఎస్ -కాంగ్రెస్ పార్టీల్లోని అసంత్రుప్తులు, బలమైన నేతల మధ్దతుతో వినోద్ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. పాత పరిచయాలతో అన్ని మండలాల్లో అతి తక్కువ కాలంలోనే బలమైన క్యాడర్ ను తయారు చేసుకున్నారు.

ఈ సీటును కూటమిలో భాగంగా సిపిఐకి కేటాయించడంతో తన గెలుపు నల్లేరు మీద నడకేనని టిఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య భావించారు. జిల్లాలో టిఆర్ఎస్ సులువుగా గెలిచే సీటు ఇదేనంటూ ఆయనకు అందరూ చెప్పడంతో సంబురపడ్డారు. కానీ వినోద్ వచ్చి ఆయనపై ఒత్తిడిపెంచారు. కొన్నాళ్లుగా చిన్నయ్యపై అసంతృప్రితో ఉన్న మెజార్టీ టిఆర్ఎస్ నేతలను తన వైపుకు తిప్పుకున్నారు. దీంతో చిన్నయ్య ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లో పరిస్థితులు ఎపుడూ ఒకలా ఉండవనడానికి ఈ రెండు నియోజకవర్గాలే నిదర్శనం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పేర్ని నాని – ఇంకా వైసీపీ ఓడిపోలేదుగా !?

మాచర్లలో ఎంతో మంది హత్యకు గురి కావడానికి... మరెన్నో హత్యా ప్రయత్నాల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూంటే వైసీపీ కొత్త సిద్దాంతంతో తెరపైకి...

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close