“చౌకీదార్ చోర్ హై” .. ఈ సారి అన్నది రాహుల్ కాదు..! శివసేన..!!

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలకు అలుసుగా మారిపోతోంది. బీహార్‌లో ఆరు స్థానాలకు పరిమితమైన రామ్‌విలాస్ పాశ్వాన్ లాంటి పార్టీని బుజ్జగించి… ఎన్డీఏలో ఉండేలా చేసుకోవడానికి అమిత్ షా రెండు రోజుల పాటు కష్టపడ్డారు. అడిగినన్ని సీట్లు ఇచ్చి.. ఓ రాజ్యసభ స్థానం ఇస్తే కానీ.. పాశ్వాన్ అండ్ సన్ సంతృప్తి పడలేదు. ఎలాగోలా.. బీహార్‌లో సీట్ల సర్దుబాటు చేసుకున్నామనుకునేలోపు.. మహారాష్ట్రలో శివసేన కత్తి దూయడం ప్రారంభించింది. ఇప్పటికే… శివసేన ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే.. బీజేపీ మాత్రం కలసి పోటీ చేస్తామన్న నమ్మకంతో ఉంది. అందుకే శివసేన చీఫ్ ఉద్ధవ్ ధాకరే బీజేపీని ఓ ఆట ఆడుకుంటున్నారు.

పార్లమెంట్‌లో రకరకాల సందర్భాల్లో మోడీ సర్కారుకు షాక్ ఇచ్చిన శివసేన ఇప్పుడు.. మహారాష్ట్రలోనూ ఇచ్చేందుకు సిద్ధమయింది. కేంద్రంతో పాటు.. మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉన్న శివసేన… పార్లమెంట్‌తో పాటు.. అసెంబ్లీ ఎన్నికలు కూడా… ఒకే సారి పెట్టాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. అదే సమయంలో రాహుల్ గాంధీపై … ఉద్ధవ్ థాకరే ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా… … “చౌకీదార్ చోర్ హై” అనే రాహుల్ గాంధీ నినాదాన్ని ఎత్తుకున్నారు. మహారాష్ట్రలో ఓ గ్రామానికి పార్టీ ప్రచారం కోసం వెళ్లిన ఉద్ధవ్… ఓ రైతును ఉద్దేశించి.. ” రోజులు మారిపోయాయి.. ఇప్పుడు రక్షణా ఉండేవాళ్లే దొంగలయ్యారని..” వ్యాఖ్యానించారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఉద్ధవ్ వ్యాఖ్యలు బీజేపీలో మంట పుట్టిస్తున్నాయి. మిత్రపక్షంగా ఉండి.. అలా ఎలా విమర్శలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కానీ నోరెత్తలేని పరిస్థితి బీజేపీ నేతలది. ఎందుకుంటే.. శివసేన ఏమి విమర్శించినా సరే ఎవరూ నోరెత్త కూడదని.. అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. అలా ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతే.. పొత్తు తెగిపోతుందని అమిత్ షా ఆందోళన. దీన్ని ఆసరాగా చేసుకుని… ఉద్ధవ్ థాకరే నేరుగా మోడీ మీదే గురి పెడుతున్నారు. శివసేనతో పొత్తు లేకపోతే..మహారాష్ట్రలోబీజేపీకి ఎన్ని సీట్లొస్తాయో.. అసలు వస్తాయో రావో అంచనా వేయడం కష్టమన్నట్లుగా పరిస్థితి ఉంది. అందుకే.. బీజేపీ ఉద్ధవ్ ఏమన్నా భరించాలని నిర్ణయించుకుంది. కానీ… శివసేన మాటలని వదిలి పెట్టదు. మేజర్ పార్టీగా మాహారాష్ట్రలో బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు ఇస్తేనే కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికి శివసేన చేస్తున్న డిమాండ్ ప్రకారం.. సిట్టింగ్ సీట్లు కూడా బీజేపీ వదులుకోవాల్సి ఉంటుంది. బీహార్ లో అదే జరిగింది. మరి మహారాష్ట్రలోనూ త్యాగం చేస్తారా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close