మినిమం గ్యారెంటీ ట్యాగ్ లైన్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా యంగ్ హీరోలకు. ఆ టాస్క్ ని ఈజీగా దాటేసిన హీరో… శ్రీవిష్ణు. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ అనే బిరుదు సొంతం చేసుకొని – దాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రేక్షకుల్ని నవ్వించడమే పనిగా పెట్టుకొన్నాడు. ఎంటర్టైన్మెంట్స్ కథలు తనకు బాగా నప్పుతాయి. ఆ క్రమంలోనే చేసిన మరో సినిమా ‘విష్ణు విన్యాసం’. నయన్ సారిక కథానాయిక. యదునాథ్ మారుతి రావు దర్శకుడు. మురళీ శర్మ కీలక పాత్రధారి. ఈనెల 28న విడుదల కానుంది. ఈరోజు టీజర్ బయటకు వచ్చింది.
టీజర్ చూస్తే.. విష్ణు మార్క్ కామెడీ సినిమా అనే విషయం అర్థం అవుతుంది. విష్ణు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. ఎప్పటిలానే గమ్మత్తుగా కుదిరింది. ఈసారి నయన సారిక పాత్ర కూడా ఎంటర్టైన్ చేయబోతుందని అనిపిస్తుంది. కార్లో.. క్వార్టర్ గురించి మాట్లాడుకోవడం నుంచే ఫన్ మొదలైపోయింది. చిన్నూ, జున్నూ అని ముద్దు పేర్లు పెట్టుకోవడం, హీరోకి వాస్తు పిచ్చి ఉందన్న విషయాన్ని బయట పెట్టడం ఇవన్నీ ఫన్నీగా కుదిరాయి. సత్యం రాజేష్ – మురళీ శర్మ హీరో కి ఇచ్చే ఎలివేషన్లు నవ్విస్తాయి. హీరోయిన్ క్యారెక్టర్ లో కూడా చిన్నపాటి గమ్మత్తు ఉంది. అది.. టీజర్ చూస్తే తెలిసిపోతుంది. విష్ణు కొన్ని డైలాగులు మింగి చెప్పడం అనే కాన్సెప్ట్ గత సినిమాల్లో బాగా వర్కవుట్ అయ్యింది. ఈసారీ అదే ఫాలో అయిపోయాడు. కెమెరా వర్క్ కలర్ఫుల్ గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. హీరో హీరోయిన్ జంట బాగుంది. శ్రీవిష్ణు కామెడీ కూడా వర్కవుట్ అయిపోతే… తన ఖాతాలో మరో హిట్టు పడినట్టే.
