ప్ర‌శ్న‌ల్ని దాటేయడమే మోడీ స‌మాధాన‌మ‌న్న రాహుల్‌!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి వ్యంగ్య విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. క్షేత్ర‌స్థాయి కార్య‌క‌ర్త‌లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చే ప‌రిస్థితిలో మోడీ లేర‌న్నారు. అలాంటి వ్య‌క్తి మీడియా స‌మావేశాలు నిర్వ‌హించ‌డ‌మేంటంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎద్దేవా చేశారు. గ‌త‌వారం పుదుచ్చేరిలోని బూత్ స్థాయి కార్య‌క‌ర్త‌ల‌తో ప్ర‌ధాన‌మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఆ సంద‌ర్భంగా ఓ కార్య‌క‌ర్త అడిగిన ప్ర‌శ్న‌కు మోడీ స్పందించిన తీరును… ఆ వార్తాక‌థ‌నం లింక్ ను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ రాహుల్ విమ‌ర్శ‌లు చేశారు.

ఆ స‌మావేశంలో నిర్మ‌ల్ కుమార్ జైన్ అనే కార్య‌క‌ర్త ప్రధానిని ఓ ప్ర‌శ్న అడిగారు. మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల నుంచి ప‌న్నులు వ‌సూళ్లు చేయ‌డం మీదే ఎక్కువ శ్ర‌ద్ధ పెడుతున్న‌ట్టుగా ఉంద‌నీ, అలాంటి శ్ర‌ద్ధ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల సంక్షేమంపై ఎందుకు పెట్ట‌డం లేదంటూ మోడీని ప్ర‌శ్నించారు. దీనికి మోడీ స్పందిస్తూ… ‘మీరు వ్యాపారి కాబ‌ట్టి, ఆ త‌ర‌హాలోనే మాట్లాడ‌టం మీ స్వాభావం. ప్ర‌జ‌ల ప‌క్షానే నేను ఉంటాను’ అంటూ కాసేపు అటూఇటూ చూస్తూ టైం పాస్ చేశారు. కార్య‌క‌ర్త అడిగిన ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధానం చెప్ప‌కుండా… వ‌ణ‌క్కం పుదుచ్ఛేరీ అంటూ దాటేశారు.

ఇదే టాపిక్ ను మరోసారి గుర్తు చేస్తూ రాహుల్ తాజాగా ట్వీట్ చేశారు. మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి స‌మాధానం ఇవ్వ‌కుండా చ‌ర్చ‌ను ప‌క్క‌తోవ ప‌ట్టించ‌డ‌మేంట‌న్నారు. ఇది జ‌రిగిన త‌రువాత‌, సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లు మోడీని అడ‌గాల‌నుకున్న ప్ర‌శ్న‌ల‌న్నింటినీ ఆ పార్టీవారు ముందుగానే అడిగి తెలుసుకోవ‌డం మొద‌లుపెట్టార‌న్నారు. ప్ర‌శ్న‌లకి స‌మాధానాలు చెప్పుకుండా.. త‌ప్పించుకోవ‌డం అనేది సూప‌ర్ ఐడియా అనీ, ఇలాగే స‌మాధానాలు చెప్ప‌డం కూడా దాటేస్తుంటే ఇంకా బాగుంటుందంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

మోడీని విమ‌ర్శించ‌డానికి దొరికే ఏ ఛాన్స్ నీ ఈ మ‌ధ్య రాహుల్ వ‌దులుకోవ‌డం లేదు. అందుకే, వారం కిందట జరిగిన కార్యక్రమాన్ని ఇప్పుడు మళ్లీ గుర్తుచేశారు. జీఎస్టీ భారాన్ని 12 శాతం వ‌ర‌కూ కొన్ని వ‌స్తువుల‌పై త‌గ్గించే ఆలోచ‌న‌లో ఉన్నామ‌ని మోడీ చెప్పిన‌ప్పుడు కూడా ఇలాగే ట్విట్ట‌ర్ లో స్పందించారు. జీఎస్టీ త‌గ్గించొచ్చు అని తాను గ‌తంలో చెప్తే గ్రేట్ స్టుపిడ్ థాట్ అంటూ ఎద్దేవా చేశారనీ, ఆల‌స్యంగానై క‌ళ్లు తెరిస్తే సంతోష‌మే క‌దా అంటూ రాహుల్ వ్యంగ్యంగా స్పందించారు. మూడు రాష్ట్రాల ఎన్నిక‌ల గెలుపు త‌రువాత మోడీపై విమ‌ర్శ‌ల దాడిని రాహుల్ బాగానే పెంచుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close