ఏ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఉందో జీవీఎల్ కి అర్థం కావ‌ట్లేదు..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో అసహనం పెరిగిపోతోందంటూ భాజపా ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావు విమ‌ర్శించారు. ఢిల్లీలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… ఆంధ్రాలో టీడీపీ ప‌త‌నం మొద‌లైంద‌నీ, ఆయన సొంతంగా ఎదిగే ప‌రిస్థితి లేద‌న్నారు. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై జ‌రిగిన కోడి క‌త్తి దాడి కేసును ఎన్‌.ఐ.ఎ. ద‌ర్యాప్తు మొద‌లుపెట్టిన ద‌గ్గ‌ర్నుంచీ చంద్ర‌బాబు వెన్నులో వ‌ణుకుపుడుతోంద‌న్నారు. దేశంలో ఎక్క‌డైనా విచార‌ణ చేప‌ట్టగ‌లిగే అధికారం ఎన్‌.ఐ.ఎ.కి ఉంద‌న్నారు. ఎన్‌.ఐ.ఎ. మీద చంద్ర‌బాబుకి గౌర‌వం ఉన్న‌ట్టు కాసేపు, లేన‌ట్టు కాసేపు మాట్లాడ‌తార‌న్నారు.

టీడీపీ చేస్తున్న అప్ర‌జాస్వామ్య కార్య‌క్ర‌మాల వ‌ల్ల వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌చ్చే ఆ ప‌ది సీట్లూ రాకుండా పోతాయ‌న్నారు జీవీఎల్‌. కాంగ్రెస్ పార్టీలో టీడీపీ పూర్తిగా విలీన‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఓ స‌మీక‌ర‌ణం కూడా చెప్పారండోయ్‌! వ‌న్ ప్ల‌స్ వ‌న్ క‌లిస్తే, సాధార‌ణంగా టు అవుతుందన్నారు జీవీఎల్‌. ఐదుకి ఒక‌టి క‌లిపితే ఆరు అవుతుంద‌నీ, కానీ తెలంగాణ ఎన్నిక‌ల్లో ఫైవ్ ప్ల‌స్ వ‌న్ టు అయింద‌న్నారు!! వారికి రావాల్సిన సీట్ల‌కంటే త‌గ్గాయ‌నీ, అలాంటి స‌మీక‌ర‌ణ‌మే ఆంధ్రాలో రాబోతోంద‌న్నారు జీవీఎల్‌. ఆంధ్రాలో టీడీపీ స‌ర్కారుపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను అనుకూలంగా మార్చుకుంటామ‌ని, దానికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ కూడా సిద్ధం చేసుకున్నామ‌న్నారు. కోర్ క‌మిటీ మీటింగులో దీనికి సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నామ‌న్నారు.

ఆంధ్రాలో భాజ‌పా వాస్త‌వ ప‌రిస్థితి ఏంట‌నేది ఆ పార్టీ నేత‌ల‌కే అవ‌గాహ‌న లేన‌ట్టుగా క‌నిపిస్తోంది..! ఆంధ్రాలో ప్ర‌జ‌లు ఎవ‌రికి వ్య‌తిరేకంగా ఉన్నారో అనేది ఎన్నిక‌లు పూర్త‌యితే త‌ప్ప‌ జీవీఎల్ కి అర్థం కాదేమో..! మోడీ స‌ర్కారు ఆంధ్రాపై ఎంత‌టి క‌క్ష‌సాధింపు ధోర‌ణితో వ్య‌వహ‌రిస్తోందో అంద‌రికీ తెలిసిందే. విభ‌జన‌ చ‌ట్టంలో అంశాలు, మోడీ ఇచ్చిన హామీలు.. ఇవేవీ అమ‌లు చేయ‌ని ప‌రిస్థితి ఉంది. వీటిపై జీవీఎల్ మాట్లాడ‌రు. ఆంధ్రాలో అనుస‌రించాల్సిన కార్యాచ‌ర‌ణను కోర్ క‌మిటీలో ఖ‌రారు చేశామంటున్నారు. అంతేగానీ, ఆంధ్రాకు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేశామా లేదా అనే చ‌ర్చ ఆ కోర్ కమిటీలో చేయ‌రు. స‌రే, జీవీఎల్ లాంటి వ‌ల‌స నేత‌ల‌కు ఆంధ్రాపై అభిమానం లాంటివి ఉండొక‌పోవ‌చ్చు, క‌నీసం ఇక్క‌డి నుంచి వెళ్లిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ లాంటివారు కూడా ఆ భేటీ ఏపీ హ‌క్కుల గురించి మాట్లాడ‌రా..? ఏపీలో ఎవ‌రిపై ఎందుకు వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మౌతోందో విశ్లేషించుకోరా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close