భజన పాటలు ఓట్లు వేయించవ్‌ వీహెచ్‌ గారూ!

సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు.. అవును మరి.. ఆ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహమూ లేదు. అందుకు ఉద్యమానికి సారథ్యం వహించిన కేసీఆర్‌.. సకుటుంబంగా వెళ్లి ఆమెకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఆమెను తెలంగాణ ఇచ్చిన దేవతగా కూడా అభివర్ణించారు. ఆ పర్వం అయిపోయింది. ఆమె తెలంగాణ ఇచ్చింది గనుక.. తెలంగాణ ప్రజల్ని జీవితపర్యంతమూ ఆమె సారథ్యం వహించే పార్టీకే ఓట్లు వేయమని అడిగితే ఎలాగ? పోరాడిన వాళ్లు, తెలంగాణ పునాదుల్లో ప్రగతిలో, అభివృద్ధిలో భాగస్వాములు అయిన వారు… అందరి సంగతి ఏం కావాలి? ఈ లాజిక్కులు అన్నీ వదిలేసి.. కేవలం తెలంగాణ ఇచ్చింది గనుక.. సోనియాను నెత్తిన పెట్టుకోవాలని అంటే.. థాంక్స్‌ చెప్పేసిన తర్వాత కూడా జనం ఎందుకు పట్టించుకుంటారు? ఈ చిన్న లాజిక్‌ను అర్థం చేసుకోలేకపోతున్నందుకే.. కాంగ్రెస్‌ పార్టీ వరుస పరాజయాలతో కునారిల్లిపోతున్నది.

సోనియా ఇచ్చింది.. అంటూ.. వీహెచ్‌, ఉత్తం, వంటి నేతలంతా పదేపదే భజన చేస్తూ ఉంటారు. అడిగితే అన్నం పెట్టే అమ్మ లాగా కూడా కాదు. విపరీతంగా పోరాడిన తర్వాత కానీ సోనియా రాష్ట్రం ఇవ్వలేదు. ఉద్యమం.. ప్రభుత్వం మెడమీద కత్తిలాగా మారిన ఉధృత సమయానికి ఆమె సారథ్యంలోని ప్రభుత్వం రాజ్యమేలుతున్నది గనుక.. ఇవ్వాల్సి వచ్చిది. మరో ప్రభుత్వం ఉంటే వారే ఇచ్చేవారు.. అని జనానికి క్లారిటీ వచ్చింది.

అందుకే సోనియాపట్ల కృతజ్ఞతతో కాంగ్రెసుకు ఓట్లు వేయమని రాష్ట్రంలో సాగించే ప్రచారానికి అసలు జనస్పందన ఉండడం లేదు. కానీ.. ప్రస్తుతం గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీకి ప్రచార ఇన్చార్జిగా నియమితులైన ఎంపీ వీ హనుమంతరావు ఇప్పటికీ.. సోనియా భజన చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప.. ప్రజలు తమనుంచి ఏం ఆశిస్తున్నారో కనీసం ఆ వాస్తవాల్ని గుర్తించలేకపోతున్నారు. సోనియాను దేవతగా కీర్తించి భజన చేస్తూ ఉంటే.. ఆయనకు మళ్లీ రాజ్యసభ పదవి దక్కవచ్చేమో గానీ.. ఆ భజన పాటలకు ప్రజల ఓట్లు మాత్రం రాలడం లేదు. వరంగల్‌ ఉప ఎన్నికలో కూడా ఆ విషయం వారికి స్వానుభవంలోకి వచ్చింది గానీ.. వారు పాఠాలు నేర్చుకోలేదు. పాఠాలు తెలిసినా కూడా.. ఎవరికి వారు.. తమ తమ స్వప్రయోజనాలే లక్ష్యంగా.. అమ్మ భజనకే ప్రాధాన్యం ఇస్తూ పోతున్నారు తప్ప.. పార్టీ గెలుపు గురించి ఆలోచించే వారు. నిజానికి నగర ఎన్నికల్లో కూడా పార్టీకి ఈ భజన వైఖరే శాపంగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close