వెంకన్న పాలకులకు వ్యాపారమే ప్రయారిటీ!

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరుని ధర్మకర్తల మండలి అంటే.. అందులో స్థానం సంపాదించుకోవడం కోసం.. ప్రధాని స్థాయిలో, రాష్ట్రపతి స్థాయిలో కూడా సిఫారసులు చేయించుకుంటూ ఉంటారంటే అతిశయోక్తి కాదు. వెంకన్న ధర్మకర్తల రూపంలో ఉండే హోదాకు ఉన్న గిరాకీ అలాంటిది. ఆ బోర్డులో చోటు దక్కగానే.. వేంకటేశ్వరుని భక్తుల సేవలో తరించడానికి తమకు భగవంతుడు అవకాశం ఇచ్చాడంటూ అందరూ స్టీరియోటైప్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. కానీ వాస్తవానికి దేవుని సేవ, లేదా భక్తులకు నిజమైన సేవ చేసేది ఎందరు? బోర్డు తీసుకునే నిర్ణయాలను గమనించినప్పుడు.. వారికి కేవలం వ్యాపార దృక్పథమే తప్ప.. సామాన్య భక్తులకు సేవ చేయడం ప్రాధాన్యం కానే కాదని అనిపిస్తుంది.

వివరాల్లోకి వెళితే.. వేంకటేశ్వరుని ఆర్జిత సేవలకు సంబంధించి.. టీటీడీ ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. ఆర్జిత సేవల టిక్కెట్లు సమస్తం ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించాలని నిర్ణయించారు. దీనివలన నేరుగా తిరుమలకు వచ్చేసి, అక్కడి బ్యాంకు క్యూలైన్‌లో నిల్చుని టిక్కెట్లు పొందాలని అనుకునే సామాన్య భక్తులకు ఆర్జిత సేవల టికెట్లు దొరకవు. ఆన్‌లైన్‌లో కొనగల సదుపాయం ఉన్నవారికి మాత్రమే సాధ్యం అవుతుంది. సామాన్య భక్తులకు కంటగింపు అయిన ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చినా.. వెంకన్న పాలకులు మెట్టు దిగలేదు. అయితే శుక్రవారం నుంచి మళ్లీ బ్యాంకు కౌంటర్‌ ద్వారా కూడా ఆర్జిత సేవల టికెట్ల విక్రయాలను ప్రారంభించారు. మళ్లీ భక్తులకు సదుపాయం ఏర్పడింది.

అయితే ఈ భక్తుల పట్ల సేవాభావం.. టీటీడీ పాలకుల్లో స్వతహాగా ఏర్పడింది కాదు. కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే టికెట్లు విక్రయిస్తుండగా.. సరిగా బిజినెస్‌ కావడం లేదుట. కోటాలు పూర్తయ్యేలా టికెట్ల కొనుగోళ్లు జరగడం లేదుట. బిజినెస్‌ డ్రాప్‌ అయిపోయిందనే ఉద్దేశంతో తిరిగి బ్యాంకు కౌంటర్‌ ద్వారా విక్రయాలు ప్రారంభించారుట. మరీ దుకాణం పెట్టుకుని వ్యాపారం చేస్తున్న వారి తరహాలో.. అన్ని రకాల భక్తులకు సమానంగా దేవుని సేవల అవకాశం కల్పించాలనే ప్రాథమి నీతిని పక్కనపెట్టి.. వ్యాపారంలాగా వ్యవహరిస్తున్న టీటీడీ బోర్డు నిర్ణయాల మీద ప్రజల్లో చాలా విమర్శలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close