విష్ణుకుమార్ వ్యాఖ్యల్లో ఈ మార్పు ఎందుకొచ్చిందో…!

టీడీపీ నేత‌ల‌కంటే ఎక్కువ‌గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును మెచ్చుకునేవాళ్ల‌లో భాజ‌పా ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఒక‌ప్పుడు ఉండేవారు. ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కి వ‌చ్చేయ‌డంతో స‌హ‌జంగానే భాజ‌పా నేత‌లు విమ‌ర్శ‌లు పెంచారు. ఆ క్ర‌మంలోనే విష్ణ‌ుకుమార్ రాజు కూడా ఈ మ‌ధ్య మాట్లాడుతున్నారు. అయితే, ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ భాజ‌పాను వీడి జ‌న‌సేన‌లో చేరుతున్న సంద‌ర్భంగా… విష్ణుకుమార్ కూడా కాషాయ కండువా తీసేస్తార‌నే ప్ర‌చారం బాగానే జ‌రిగింది. ఈ వార్త‌ల్ని ఆయ‌న ఖండించాల్సి వ‌చ్చింది. అయితే, ఇప్పుడు మ‌రోసారి అదే అంశంపై కొంత ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. మీడియాతో మాట్లాడుతూ… వ‌చ్చే ఎన్నికల్లో తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాన‌నేది ఇప్పుడే చెప్ప‌నంటూ చ‌మ‌త్కించారు! ఎందుకంటే, ఇప్పుడు అలాంటివి చెప్పేస్తే… త‌రువాత త‌న‌కు మీడియాలో ప్రాధాన్య‌త ద‌క్క‌ద‌న్నారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చాక తాను ఎక్క‌డి నుంచి పోటీ చేస్తాన‌నేది స్ప‌ష్టంగా చెబుతా అన్నారు. ఈ వ్యాఖ్య‌ల్లో అంత‌రార్థ‌మేంటో మ‌రి?

రాష్ట్ర ప్ర‌భుత్వం పెన్ష‌న్ల‌ను డ‌బుల్ చేయ‌డం క‌చ్చితంగా ఎన్నిక‌ల స్టంటే అంటూ ఓ ప‌దిరోజుల కింద‌టే విష్ణుకుమార్ ఖండించారు. స‌భ‌ల పేర్ల‌తో ప్ర‌జా ధ‌నాన్ని టీడీపీ నేత‌లు లూఠీ చేస్తున్నారంటూ విమ‌ర్శించారు. అయితే, ఇవాళ్ల ఇదే అంశ‌మై ఆయ‌న మాట్లాడుతూ… పెన్ష‌న్లు పెంపు, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఆర్థిక సాయం లాంటి కార్య‌క్ర‌మాలు టీడీపీకి క‌చ్చితంగా సానుకూల‌మైన అంశాలు అవుతాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆర్థికంగా సాయం ప్ర‌క‌టిస్తే… అధికార పార్టీపై ప్ర‌జ‌ల్లో సానుకూల‌త పెరుగుతుంద‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీకి మ‌రోసారి జ‌న‌సేన అవ‌స‌రం ఉన్న‌ట్టుంద‌నీ, అందుకే ఈ మ‌ధ్య టీడీపీ నేత‌లు ప‌వ‌న్ మీద విమ‌ర్శ‌లు త‌గ్గించార‌న్నారు.

ఆంధ్రాలో భాజ‌పా పొత్తు గురించి కూడా కొంత ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యే చేశారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో భాజ‌పాతో పొత్తు పెట్టుకునేందుకు ఎవ‌రు ముందుకు వ‌స్తార‌న‌డం విశేషం. స‌రిగ్గా ప‌దిరోజుల కింద‌టే… ఎన్ని పార్టీలు క‌లిసినా భాజ‌పాని ఏం చెయ్య‌లేవు, ఆంధ్రాలో 175 స్థానాల్లో తాము గెలుస్తున్నామ‌ని ధీమాగా చెప్పారు. కానీ, త‌మ‌తో పొత్తుకు ఎవ‌రు ముందుకొస్తార‌ని ఇప్పుడు ఇంకోలా చెబుతున్నారు. మొత్తానికి, భాజ‌పాని ఉద్దేశించి విష్ణుకుమార్ చేసిన వ్యాఖ్య‌లు కాస్త ట్రికీగా ఉన్నాయి. ఆయ‌న స్పందించిన తీరులో రెండు అర్థాలు ధ్వ‌నిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలో మార్పు అయితే సుస్పష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close