టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న మ‌ణిర‌త్నం స్క్రిప్టు

ఒక‌ప్పుడు మ‌ణిర‌త్నం అంటే స‌గ‌టు సినీ అభిమానుల‌తో పాటు… హీరోలంతా ప‌డి చ‌చ్చిపోయేవారు.

‘నేను మ‌ణిర‌త్నం అభిమానిని’ అని చెప్పుకోవ‌డం హీరోల‌కు ఓ ఫ్యాష‌న్‌గా మారింది. చాలామంది ఇప్ప‌టికీ ఆహా మ‌ణిర‌త్నం.. ఓహో మ‌ణిర‌త్నం అంటూ భ‌జ‌న చేస్తూనే ఉంటారు. కాక‌పోతే మ‌ణిర‌త్నంతో సినిమా చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్పుడు మాత్రం `సైలెంట్‌`గా జారుకుంటున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తోంది. తెలుగులో ఓ సినిమా చేయాల‌ని మ‌ణి ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ… త‌న క‌థ‌కు స‌రిప‌డా హీరో దొర‌క‌డం లేదు. దొరికినా.. వాళ్లెవ్వ‌రూ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మ‌ణిర‌త్నంతో సినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపించ‌డం లేదు. అలా.. మ‌ణి స్క్రిప్టు ఒక‌టి టాలీవుడ్లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. యువ హీరోల వెంట తిరుగుతోంది.

ఈ క‌థ ముందు విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. విజ‌య్ ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు కూడా. కానీ అంత‌లోనే డ్రాప్ అయ్యాడు. విజ‌య్ త‌ర‌వాత నాని వ‌ర‌కూ ఈ క‌థ వెళ్లింది. నాని మ‌ణిర‌త్నంకి వీరాభిమాని. ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో చూస్తున్నాడు. అయినా స‌రే.. నాని స్పందించ‌లేదు. ఇప్పుడు ఇదే క‌థ శ‌ర్వానంద్ వ‌ర‌కూ వెళ్లింది. శ‌ర్వా కూడా క‌థ విని.. మొహ‌మాటం లేకుండా ‘నో’ అనేశాడ‌ట‌. అయినా స‌రే.. మ‌ణిర‌త్నం త‌న ప్ర‌యత్నాలు ఆప‌డం లేద‌ని తెలుస్తోంది. క‌థానాయ‌కుల్ని న‌మ్ముకోకుండా ఎప్పుడూ త‌న క‌థ‌నే న‌మ్ముకునే ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం. కొత్త‌వాళ్ల‌తో ప్ర‌యోగాలు చేయ‌డానికి వెనుకంజ ఎప్పుడూ వేయ‌లేదు. స్టార్ల వెంట కూడా తిర‌గ‌లేదు. అలాంటిది ఓ క‌థ ప‌ట్టుకుని, హీరోని వెదికే ప‌నిలో నెల‌లు నెల‌లు శ్ర‌మిస్తున్నాడంటే… మ‌ణిర‌త్నం క్రేజ్ ఏ స్థాయికి వెళ్లిపోయిందో అర్థం అవుతూనే ఉంది. మ‌రి ఈ క‌థ ఏ హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close