వాలెంటైన్స్ డేపై న‌మ్మ‌కం లేదు: ర‌కుల్ ప్రీత్ సింగ్‌

ఫిబ్ర‌వ‌రి 14 అంటే… ప్రేమికుల‌కు పండ‌గ‌. ప్రేమ‌లో ఉన్నా, లేకున్నా – ఈత‌రం మాత్రం వాలెంటైన్స్ డేని ఓ సంబ‌రంగా జ‌రుపుకుంటున్నారు. ఆ రోజు పార్కులు, షాపింగ్ మాళ్లూ నిండిపోవ‌డం ఖాయం. అయితే ఈ సంప్ర‌దాయాన్ని ర‌కుల్‌ప్రీత్ సింగ్ త‌ప్పుప‌డుతోంది. `ఇదంతా వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్‌.. మ‌న‌కు సంబంధం ఏముంది?` అని ప్ర‌శ్నిస్తోంది.

”వాలెంటైన్స్ డేపై నాకు ఎలాంటి న‌మ్మ‌కం లేదు. నేనెప్పుడూ జ‌రుపుకోలేదు. జ‌రుపుకోను కూడా. ప్రేమ‌కు ఒక్క‌రోజే ప‌రిమితం చేయ‌డం నాకు నచ్చ‌దు. ప్రేమంటే కేవ‌లం యువ‌తీ యువ‌కుల మ‌ధ్యే ఉంటుంద‌నుకోవ‌డం పొర‌పాటు. త‌ల్లిదండ్రుల‌పై, తోడ‌బుట్టిన‌వాళ్ల‌పై కూడా ఉంటుంది. ఆ ఒక్క‌రోజూ ప్రేమించుకుని, ఆ త‌ర‌వాత యేడాదంతా కొట్టుకుంటూ బ‌తుకుతున్నా ఫ‌ర్వాలేదా? కేవ‌లం షాపింగుల‌కూ, షికార్ల‌కూ త‌ప్ప ఈ ప్రేమికుల రోజు ఎందుకు ప‌నిచేయ‌దు” అంటూ తేల్చి చెప్పేసింది. అన్న‌ట్టు ఈనెల 14న‌, సరిగ్గా ప్రేమికుల రోజున ర‌కుల్ న‌టించిన `దేవ్‌`విడుద‌ల అవుతోంది. ”దేవ్‌ని విడుద‌ల రోజునే కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి చూస్తున్నా. నా సినిమాని మొద‌టి రోజునే కుటుంబ స‌భ్యుల‌తో చూడ‌డం ఇదే తొలిసారి” అంటోంది ర‌కుల్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close