బడ్జెట్ ప్రవేశ పెట్టేది కేసీఆరే..!

తెలంగాణ అసెంబ్లీలోఈ సారి ఓ వినూత్నమైన దృశ్యం కనిపించబోతోంది. హోంశాఖ మినహా.. అన్ని శాఖల బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ నెల 22నుండి 25 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే బడ్జెట్‌పై.. కేసీఆర్ పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. కేసీఆర్ దిశానిర్దేశంతో.. అధికారులు బడ్జెట్‌ను దాదాపుగా పూర్తి చేసారు. 22వ తేదీన ఉదయం పదకొండున్నర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మరుసటి రోజు దీనిపై చర్చ జరగనుంది. బడ్జెట్ సమావేశాలు ఖరారైనందున మంత్రి వర్గ విస్తరణ జరిగుతుందని.. టీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. కానీ.. కేసీఆర్ తీరును పరిశీలిస్తున్న వారు మాత్రం.. నమ్మకం పెట్టుకోలేమని చెబుతున్నారు.

బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు విసర్తణ జరగపోతే ముఖ్యమంత్రి కేసీఆరే బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఖాయం. ఒక వేళ విస్తరణ జరిపినప్పటికీ.. శాఖలు కేటాయించకపోయినా… కేసీఆరే బడ్జెట్ ప్రవేశ పెడతారు. అన్నింటిపై.. కేసీఆర్‌కు అవగాహన ఉంటుంది కాబట్టి.. ఇదే మంచిదని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి నెలాఖరులోగా కొత్త బడ్జెట్‌ను ఆమోదించుకోవాలి. అందుకనుగుణంగా ఫిబ్రవరిలోనే బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినందున… 2019-20 సంవత్సరానికి రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకునే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ మాత్రం మధ్యంతర బడ్జెట్ కే మొగ్గు చూపుతున్నారు.

అయితే కొంత మంది ఆశావహులు మాత్రం… ముహుర్తులు చూసుకుంటున్నారు. కేసీఆర్‌కు కలసి వచ్చే ముహుర్తాలు లెక్కలేసుకుని… ఆ తేదీల్లో విస్తరణ ఉంటుందనే అంచనాలకు వస్తున్నారు. ఈ నెల 18న ఉదయం, 19న మధ్యాహ్నం, 21వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని.. వారు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల దాటిపోయినందున… మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంటుందని వారి నమ్మకం. కానీ కేసీఆర్ ఆలోచనలేమిటో మాత్రం ఇంత వరకూ బయటకు రాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close