బీహార్ సీఎంపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశం..!

బీహార్ ముఖ్యమంత్రిపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. వసతి గృహాల్లో బాలికలపై అత్యాచారం కేసులకు సంబంధించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై సీబీఐ విచారణ జరపాలని ‘పోస్కో’ ప్రత్యేక కోర్టు షాక్ ఆదేశాలు జారీ చేసింది. నితీష్ తో పాటు నిందితులైన ధర్మేంద్ర సింగ్, అతుల్ ప్రసాద్‌లపై సీబీఐ విచారణ జరగనుంది. బీహార్ లోని ముజఫర్ పూర్ లో.. వసతి గృహంలో జరిగిన ఘోరాలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. బ్రజేష్ ఠాకూర్ అనే ఎన్జీవో ఆధ్వర్యంలో నడిచిన ముజఫర్ పూర్ షెల్టర్ హోంలో కీచక పర్వం అంతులేకుండా సాగింది. ముజఫర్ పూర్‌ వసతి గృహంలో ఏకంగా 40 మందికి పైగా బాలికలు అత్యాచారానికి గురయ్యారని నివేదిక బట్టబయలు చేసింది. దీంతో బీహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. కానీ ముజఫర్ పూర్ కేసులో అప్పట్లో మంత్రిగా ఉన్న మంజూ వర్మ భర్త ప్రమేయం కూడా ఉంది. దాంతో మంజూ వర్మ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఈ కేసు విచారణ విషయంలో బీహార్ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. దీనిపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్య్కతం చేసింది. బీహార్‌లోని వసతి గృహాలకు సంబంధించిన వివరాలను నితీష్ కుమార్ ప్రభుత్వం అందించడం లేదంటూ అంతకుముందు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం ఈ కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారి శర్మను బదిలీ చేయడంపై కూడా సీబీఐని కోర్టు మందలించింది. దీనిపై వివరణ ఇస్తూ అఫిడవిట్ సమర్పించాలని కూడా దర్యాప్తు సంస్థను సీజేఐ రంజన్ గొగోయ్‌తో కూడిన బెంచ్ ఆదేశించింది. ఇలా బదిలీ చేసినందుకు సీబీఐ మాజీ తాత్కాలిక డైరక్టర్ మన్నెం నాగేశ్వరరావును కోర్టు ధిక్కరణ చేసినట్లుగా ప్రకటించి ఓ రోజు కోర్టులో నిలబెట్టింది.రూ. లక్ష జరిమానా కూడా విధించింది.

బీహార్ లో ఉన్నది.. బీజేపీ – జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం. సీబీఐ వారి చేతుల్లోనే ఉన్నారు కాబట్టి… ఇప్పటికిప్పుడు.. నితీష్ కుమార్ కు వచ్చిన సమస్యేమీ లేదు. కానీ.. సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించినందున నైతిక బాధ్యతగా భావించి.. రాజీనామా చేయాలనే డిమాండ్లు విపక్ష పార్టీల నుంచి వస్తున్నాయి. కానీ.. నితీష్ దీన్ని పట్టించుకునే అవకాశం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close