ఇక 33 జిల్లాల తెలంగాణ..! మరో రెండు కొత్తవి ఏర్పాటు..!

తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కి చేరింది. విభజనకు ముందు తెలంగాణలో ఉన్న జిల్లాల సంఖ్య కేవలం పది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాటిని 31కి చేశారు. ఎన్నికల ప్రచారంలో.. రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దాని ప్రకారం .. రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. కొత్త నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు చేరింది. రెండు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2018 డిసెంబరు 31న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. వాటన్నింటి ఆధారంగా 11 మండలాలతో నారాయణపేట జిల్లా, 9 మండలాలతో ములుగు జిల్లా తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆదివారం నుంచే కొత్త జిల్లాలు ఉనికిలోకి వస్తాయి. రెండు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర అధికారులను నియమిస్తారు.

సహజంగా.. పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ జిల్లా ఉండటాన్ని ప్రామాణికంగా భావిస్తారు. కానీ.. తెలంగాణలో మాత్రం… ఇప్పడు పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు జిల్లాలు ఉన్నాయి. ఉన్నది పదిహేడు పార్లమెంట్ స్థానాలు అయితే.. జిల్లాలు మాత్రం 33 ఉన్నాయి. రెండేళ్ల కిందట ఏర్పాటు చేసిన జిల్లాలకు ఇప్పటికీ పూర్తి స్థాయి ఉనికి రాలేదు. ఏదైనా సందర్భంలో.. ప్రభుత్వం కూడా ఉమ్మడి జిల్లాలుగానే సంబోధిస్తూ వ్యవహారాలు నడుపుసోతోంది. ఇక రాజకీయ పార్టీలు.. జిల్లాల వారీగా అధ్యక్షుల్ని నియమించుకున్నప్పటికీ.. కార్యక్రమాలన్నింటినీ ఉమ్మడి జిల్లాల వారీనే నిర్వహిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలను కూడా అలాగే పరిగణనోలకి తీసుకున్నారు.

ప్రజల సెంటిమెంట్లు ఆధారంగా.. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. 31 జిల్లాల ఆధారంగా జోన్లను కూడా విభజించారు. గతంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో .. ఉద్యోగ నియామకాల విషయంలో.. ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి.. ఎన్నికలకు ముందు .. కొత్త జోన్లకు.. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు మళ్లీ జిల్లాల స్వరూపంలో మార్పులు చేయడంతో.. జోన్ల విషయంలో ఏం జరుగుతుందోననే చర్చ నిరుద్యోగుల్లో ప్రారంభం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close