సందట్లో సడేమియా..! పోలవరం ఆపేందుకు తెలంగాణ కొత్త ప్రయత్నం..!?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను… కొంత మంది నుంచి తమకు లభిస్తున్న మద్దతును.. తెలంగాణ ప్రభుత్వం… పక్కాగా ఉపయోగించుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలంటూ.. సైలెంట్‌గా సుప్రీంకోర్టును… తెలంగాణ సర్కార్ ఆశ్రయించింది. శరవేగంగా సాగుతున్న పనులు.. ఎక్కడిక్కకడ ఆపేయడానికి… ప్లాన్ రెడీ చేసుకుంది. 11వ తేదీన.. ప్రాజెక్టుపై తనకున్న అభ్యంతరాలను తెలియజేస్తూ సుప్రీంకోర్టులో చడీచప్పుడు కాకుండా పిటిషన్‌ వేసింది. కోర్టు వ్యాజ్యాల విషయంలో అప్రమత్తంగా ఉంటున్న ఏపీ జల వనరుల శాఖ ఈ పిటిషన్‌ వివరాలను సేకరించింది.

తెలంగాణ పిటిషన్‌లో ముఖ్యంగా 3 అంశాలను ప్రస్తావించారు. ప్రాజెక్టు నిర్మాణంవల్ల తెలంగాణ భూభాగంలోని జల విద్యుత్కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులూ లేవని నిర్ధారించాలని… దాని కోసం అధ్యయనం చేయాలని టీ సర్కార్‌ కోరింది. ఆయా అంశాలపై అధ్యయన నివేదిక వచ్చేంతవరకూ పోలవరం నిర్మాణం ఆపాలన్నదే దాని ఉద్దేశంగా కనిపిస్తోందని రాష్ట్ర ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ గతంలో కేసీఆర్‌ కుమార్తె, ఎంపీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త మెలిక పెడుతోంది.

నిజానికి ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం. ఏపీ నుంచి దిగువకు వెళ్లే ప్రతి నీటి చుక్కా.. సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఆ సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకునేందుకు.. చంద్రబాబు పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు చేపట్టారు. అయితే.. వీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేసింది. ఇప్పుడు నేరుగా పోలవరంపై గురి పెట్టిందన్న విమర్శలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close