తెలంగాణ కాంగ్రెస్‌ను టీఆర్ఎస్‌లో విలీనం చేయడం ఖాయమేనా..?

కాంగ్రెస్‌ వలసల వెనుక కేసీఆర్.. ఆ పార్టీని భూస్థాపితం చేసే లక్ష్యంతో ఉన్నారు. టీఆర్ఎస్‌లో టీటీడీపీని వీలినం చేసుకున్న స్ట్రాటజీనే ఇప్పుడు కాంగ్రెస్ విషయంలోనూ అమలు చేయాలని… నిర్ణయించుకున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు నైతికంగా కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని టీఆర్ఎస్ కొనసాగిస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన టిఆర్ఎస్…మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించిన టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఎమ్మెల్యేలకు గాలం వేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి గులాబి పార్టీలో చేరతామని ప్రకటించగా తాజాగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసారు. అనంత‌రం టీఆర్ఎస్ చేరుతున్నట్టు ప్రకటన‌ విడుదల చేసారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్దుల ప్రకటన‌కు ముందు నుంచే టీఆర్ఎస్ ఓ ప్రణాళికతో ముందుకెళ్లింది. ఎమ్మెల్యే కోటాలో నలుగురు ఎమ్మెల్సీలను మాత్రమే గెలిపించుకునే బలం ఉన్నా టీఆర్ఎస్ ఐదో అభ్యర్దిగా మిత్రపక్షం ఎంఐఎం కు మద్దతివ్వడం గులాబీ పార్టీ ముందస్తూ వ్యూహంతోనే ముందుకెల్లింది. ఈ వ్యూహంతోనే హస్తం పార్టీని దెబ్బకొట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోనికి చేరుతామని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బహిష్కరించింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్దులు సునాయాసంగా విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లాలో కీలక నేత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైంది. త్వరలోనే ఆమే కూడా కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మరికొంత మంది ఎమ్మెల్యేలు కారెక్కెందుకు రెడీ ఉన్నరనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఈ నెల 19 న నిజామాబాద్ లో జరిగే బహిరంగ సభలో టీఆర్ఎస్ లో చేరుతారని వాదన బలంగా వినిపోస్తోంది. మరోవైపు భధ్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా గులాబి గూటికి చేరుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వీరందర్నీ చేర్చుకున్న తర్వాత… ప్రతిపక్ష హోదా.. కాంగ్రెస్‌కు పోతుంది. మెజార్టీ… ఎమ్మెల్యేలు చేరిన తర్వతా.. కాంగ్రెస్ ఎల్పీని.. టీఆర్ఎస్‌లో విలీనం చేయాలనే వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేయబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com