మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. అనిల్ రావిపూడి ఈరోజు నుంచి స్క్రిప్టు పనులు కూడా మొదలెట్టేశాడు. మహర్షి పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఇందులో మహేష్పాత్ర ఏమిటన్న విషయంలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇందులో మహేష్ పోలీస్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అనిల్ రావిపూడి తొలి చిత్రం `పటాస్`లో హీరో పోలీసే. ఇప్పుడు అదే స్టైల్లో ఓ పోలీస్ స్టోరీ రాశాడని చెప్పుకుంటున్నారు.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో మహేష్ ఓ మిలటరీ ఆపీసర్గా కనిపించనున్నాడని తెలుస్తోంది. సెలవల కోసం ఇంటికి వచ్చిన ఓ మిలటరీ ఆఫీసర్ చుట్టూ సరదాగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని మలుస్తున్నాడట అనిల్. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 చిత్రాలలో వినోదానికి పెద్ద పీట వేశాడు అనిల్. ఈసారి కూడా హీరోయిజానికంటే.. ఎంటర్టైన్మెంట్కే ఎక్కవ ప్రాధాన్యం ఇవ్వబోతున్నాడట. కామెడీ పండించడంలో మహేష్ కూడా సిద్దహస్తుడే. కాబట్టి.. ఈ కాంబోకి ఢోకా లేనట్టే.