అడ్వాన్సులే అప్పులైతే.. ! పవన్‌కు రూ. 33 కోట్ల రుణాలు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రూ. 33 కోట్ల రూపాయలకుపైగా అప్పులు ఉన్నాయి. ఇందులో ఆయన చేబదులుగా తీసుకున్న రుణాలే ఎక్కువగా ఉన్నారు. ఆప్తమిత్రుడుగా భావించే.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద కూడా.. పవన్ కల్యాణ్.. రూ. రెండు కోట్ల నలబై లక్షల రూపాయల వరకూ అప్పులు తీసుకున్నట్లు తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. హారిక, హాసిని క్రియేషన్ సంస్థ దగ్గర రూ. కోటి పాతిక లక్షలు, వదిన కొణిదెల సురేఖ వద్ద రూ. కోటి ఏడు లక్షల డెభ్భై మూడూ వేల ఏడు వందల ముఫ్పై నాలుగు ( 1, 07, 73,734 ) , ఎం. ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర మరో రూ . మూడు కోట్లు, శ్రీ బాలాజీ సినీ మీడియా అనే సంస్థ దగ్గర రూ. రెండు కోట్లు, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర దగ్గర రూ. 27 లక్షల 55 వేల 554 రూపాయలు, వై. నవీన్ కుమార్ అనే వ్యక్తి దగ్గర మరో రూ. ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు. ఇతర అప్పుడు రూ. మూడు కోట్లకుపైగా ఉండగా.. మొత్తం అప్పుడు రూ. 33 కోట్ల 72లక్షలకుపైగా తేలాయి.
ఎవరైనా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఇలా కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకుంటారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం .. కేవలం చేబదులుగానే.. ఈ మొత్తాలను తీసుకున్నట్లు తన అఫిడవిట్‌లో ప్రకటించారు. ఇందులో హారిక, హాసిని క్రియేషన్ సంస్థ ,శ్రీ బాలాజీ సినీ మీడియా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అనే సంస్థల వద్ద తీసుకున్న సొమ్మును.. రుణాలుగా చూపించారు. అయితే అవి సినిమా చేసేందుకు అంగీకరించి తీసుకున్న అడ్వాన్స్‌గా భావిస్తున్నారు. ఎం.ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్ అనే వ్యక్తుల దగ్గర తీసుకున్న రూ. కోట్ల రుణం కూడా.. సినిమా అడ్వాన్సులుగానే భావిస్తున్నారు. వై.నవీన్ కుమార్ మైత్రి మూవీస్‌కు చెందిన వ్యక్తిగా భావి్సతున్నారు.  సినిమాలు చేయబోనని చాలా రోజుల క్రితమే పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయినప్పటికీ..  ఆ అడ్వాన్సులను .. పవన్ తన దగ్గరే ఉంచుకున్నారు. ఇప్పుడు వాటిని రుణాలుగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా.. ఎన్నికలు పూర్తయిన తర్వాత అంగీకరించిన సినిమాలను పట్టాలెక్కించే ఉద్దేశంతో వాటిని తన వద్దే ఉంచుకున్నట్లు  భావింవవచ్చు.
వదిన కొణిదెల సురేఖ వద్ద కూడా.. పవన్ కల్యాణ్ .రూ. కోటికిపైగా చేబదులు తీసుకున్నారు.  ఇవి పోను.. మరిన్ని  అప్పులు బ్యాంకుల వద్ద ఉన్నాయి. మొత్తంగా పవన్ కల్యాణ్ కు. రూ.33 కోట్లకుపైగా అప్పులు ఉన్నట్లు తేలాయి. పవన్ కల్యాణ్ ఎప్పుడు మాట్లాడిన తన వద్ద డబ్బుల్లేవని చెబుతూ ఉంటారు. అయితే.. ఆయన ఐదారు సంస్థల వద్ద తీసుకున్న  సినిమా అడ్వాన్సులే రూ. ఇరవై కోట్ల వరకూ ఉన్నాయి. పవన్ ఓ సినిమా తీయాలంటే.. కనీసం ఏడాది పడుతుంది. ఒప్పందం చేసుకున్న సినిమాలన్నీ తీయాలంటే.. చాలా కాలం పడుతుంది. ఇవన్నీ తిరిగివ్వాలంటే.. పవన్ ఏదో ఒక ఆస్తిని అమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయడం లేదు మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close