విశాఖ ఎంపీ స్థానాన్ని పురందేశ్వ‌రి నిల‌బెట్ట‌గ‌ల‌రా..?

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో విశాఖ‌ప‌ట్నం ఎంపీగా పురందేశ్వ‌రి పేరును ఖ‌రారు చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ సీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ‌పై భారీ మెజారిటీతో గెలిచిన కంభంపాటి హ‌రిబాబుకి ఈసారి టిక్కెట్ ద‌క్క‌లేదు! వాస్త‌వానికి, ఆయ‌నే పోటీపై పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేద‌ని అంటున్నారు. ఓద‌శ‌లో భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వైజాగ్ నుంచి పోటీ చెయ్యొచ్చ‌నే అభిప్రాయ‌లూ వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే, ఆయ‌నకి న‌ర్సరావుపేట టిక్కెట్ ను పార్టీ క‌న్ఫ‌ర్మ్ చేసింది. విశాఖ ఎంపీ స్థానం విష‌యానికొస్తే… ఇప్ప‌టికే జ‌న‌సేన నుంచి మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, వైకాపా నుంచి ఎమ్‌.వి.వి. స‌త్య‌నారాయ‌ణ‌, టీడీపీ నుంచి భ‌ర‌త్‌, ఇప్పుడు భాజ‌పా నుంచి పురందేశ్వ‌రి రాక‌తో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా క‌నిపిస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో భాజ‌పా గెలుచుకున్న ఈ సీటును, మ‌ళ్లీ నిల‌బెట్టుకునే అవ‌కాశాలు ప‌క్కాగా ఉన్నాయా అంటే… క‌ష్ట‌మే అని చెప్పాలి. ఎందుకంటే, గ‌త ఎన్నిక‌ల్లో దేశ‌వ్యాప్తంగా మోడీ హ‌వా తీవ్రంగా ఉంది. విశాఖ‌లో నేవీ, ఆర్మీ, ఇత‌ర కేంద్ర సంస్థ‌ల‌కు చెందిన ఉద్యోగుల్లో ఉత్త‌రాదివారు ఎక్కుమంది ఉన్నారు. వారి ఓట్ల‌న్నీ మోడీకి అనుకూలంగా ప‌డ‌టం, స్థానికంగా భాజ‌పాకి టీడీపీతో పొత్తు ఉండ‌టం, విశాఖ ఎంపీ ప‌రిధిలోకి ఎమ్మెల్యే నియోజ‌క వ‌ర్గాల్లో టీడీపీకి భారీ మెజారిటీతోపాటు, ఎంపీ ఓట్లు భాజ‌పాకి ప‌డ‌టం… ఇవ‌న్నీ ప్ల‌స్ అయ్యాయి. ఫ‌లితంగా వైయ‌స్ విజ‌య‌మ్మ‌పై భారీ ఓట్ల తేడాతో హ‌రిబాబు గెలిచారు.

ఈ ఎన్నిక‌ల్లో భాజ‌పాకి ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. చివ‌రికి, విశాఖ రైల్వేజోన్ ప్ర‌క‌టించినా కూడా ఉప‌యోగం లేకుండా పోయింది. జోన్ తామే ఇచ్చామ‌ని ప్ర‌ధాన‌మంత్రి స్వ‌యంగా వ‌చ్చి విశాఖ‌లో ప్ర‌క‌ట‌న చేసినా కూడా… దాని వ‌ల్ల విశాఖ ప్రాంతానికి కొత్త‌గా వ‌చ్చే లాభ‌మేదీ లేద‌నేది ప్ర‌జ‌లూ గ్ర‌హించారు. ఆంధ్రాకి మోడీ స‌ర్కారు మోసం చేసింద‌నే బ‌ల‌మైన అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఈసారి భాజ‌పాపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. మ‌రోసారి మోడీని ప్ర‌ధానిగా అత్యంత బ‌లంగా కోరుకుంటున్న ప‌రిస్థితీ దేశ‌వ్యాప్తంగా లేదు. విశాఖ‌లో ఉంటున్న ఉత్త‌రాది ఉద్యోగుల్లో కూడా ఆ మేర‌కు కొంత చీలిక క‌చ్చితంగా ఉంటుంది. అన్నిటికీ మించి, సిట్టింగ్ ఎంపీగా ఉన్న హ‌రిబాబు గ‌త కొన్నాళ్లుగా విశాఖ‌లో పార్టీ త‌ర‌ఫున చెప్పుకోద‌గ్గ‌ క్రియాశీలంగా లేరు. ఈ స‌వాళ్ల‌ను పురందేశ్వ‌రి ఎలా సానుకూలంగా మార్చుకుంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close