యూపీ కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి వచ్చినట్లే..! ప్రియాంక దూకుడు ..!

యూపీలో వట్టిపోయిన కాంగ్రెస్ పార్టీని రక్షించుకుేనందుకు ప్రియాంక గాంధీ తూర్పు యూపీ బాధ్యతలను తీసుకున్నారు. బీజేపీకి పట్టున్న ప్రాంతం. అయినా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె పూర్తి స్థాయి రాజకీయం చేస్తున్నారు. గంగా యాత్ర.. ఆలయాల సందర్శన.. ఇలా ప్రియాంక ఎన్నికల ప్రచారం కొత్తగా ఉంది. ప్రియాంక వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో వచ్చిన మార్పు స్పష్టంగా తెలుస్తోంది. యూపీలో శక్తి యాప్‌ సభ్యత్వాలు అమాంతం పెరగడం… లోకల్‌ నేతలకు జోష్‌ ఇస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే ప్రియాంక ఎంట్రీ తర్వాత 22 శాతం పెరుగుదల కనిపించడం కాంగ్రెస్‌ నేతలకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం కోసం కాంగ్రెస్‌ పార్టీ శక్తియాప్‌ను తయారు చేసింది. ఇక్కడ ప్రతి నిర్ణయానికి ముందు శక్తి యాప్‌లో పోల్‌ పెడుతారు. మెజార్టీ కార్యకర్తలు సూచించిన దానికే అధిష్టానం కూడా ఓటేస్తుంది. అంతేకాదు… హైకమాండ్‌ పెద్దలు కూడా కార్యకర్తలతో నేరుగా టచ్‌లోకి రావొచ్చు. దీనిని దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ప్రియాంక గాంధీ… మహిళలను పార్టీ వైపు ఆకర్షించేలా చేస్తున్నారు. యూపీ ఓట్‌ బ్యాంక్‌లో 50 శాతంగా ఉన్న మహిళల టార్గెట్‌గా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ఇటీవల ప్రియాంక గాంధీ ర్యాలీల్లోనూ మహిళలే అధికంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలతో ప్రియాంక కలిసిపోతున్న తీరు… అందరినీ ఆకట్టుకుంటోంది. యూపీలో కాంగ్రెస్‌ పార్టీ నిశబ్ధంగా బలపడుతుందని చెబుతున్నారు.

అయోధ్యలో మకాం వేసిన ప్రియాంక.. హిందూ బెల్ట్‌లో ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. అక్కడ విద్యార్థులతో మమేకమయ్యారు. అంతేకాదు… రాచరిక కుటుంబం అంటూ మోదీ, బీజేపీ చేస్తోన్న విమర్శలను ప్రియాంక తిప్పికొట్టారు. రాచరిక కుటుంబాలకు ఉండే అధికారాలన్నింటినీ.. ఇందిరాగాంధీయే రద్దు చేశారని చెప్పారు. ఇపుడు తాము అందరిలో ఒకరిగానే ఉంటున్నట్లు తెలిపారు. అంతేకాదు… దేశంలో నీది ఏ మతం అని అడగని రోజు రావాలని కలలు కంటున్నట్లు తెలిపారు ప్రియాంక. మొత్తంగా కాంగ్రెస్‌ ప్రియాంక కటౌట్‌ ఇపుడు పవర్‌ఫుల్‌గా మారుతోంది. మోదీకి నేరుగా కౌంటర్లు ఇస్తూ.. తెలివిగా రాజకీయం చేస్తోంది. అప్పుడప్పుడూ.. వారణాశిలో పోటీ చేస్తే తప్పేమిటని ప్రకటిస్తూ.. రాజకీయ సంచలనాలకూ… కారణం అవుతోంది. మొత్తానికి యూపీలో ఆట మాత్రం మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close