చైతన్య : భద్రాద్రి ఆంధ్రదే..! రాజకీయ పార్టీలు ఎప్పుడు తెస్తాయి..?

భద్రాచలం రాముడది తెలంగాణ కాదు. ఆంధ్రుడు. అచ్చమైన ఆంధ్రుడు. ఏ చారిత్రక సందర్భంలో చూసుకున్నా ఆయన ఆంధ్రుడే. మరి తెలంగాణకు ఎలా వెళ్లాడు..? రాజకీయ పార్టీలు ఎందుకు ఊరుకున్నాయి..? ఇప్పుడు ఆ రాముడ్ని చూపించి.. ఏపీ జీవనాడిని ఎందుకు.. ఆపేయాలనుకుంటున్నారు…?

భద్రాద్రి రాముడు ఆంధ్రుడే…! చరిత్ర చెప్పే సత్యం ఇదే..!

1956 దాకా రెండు తెలుగు రాష్ట్రాలు ఉనికిలో ఉన్నాయి. అప్పటిదాకా 13 జిల్లాల ఆంధ్రరాష్ట్రం పనిచేసింది. అదే రాష్ట్రం 1956లో తెలంగాణతో కలిసింది. స్వాతంత్ర్యాన్ని పొందినా దాదాపు రెండు సంవత్సరాలు జనరల్‌ జయంతినాథ్‌ చౌదరి అధిపతిగా సైనిక పాలనలో ఉంది. అప్పటి తెలంగాణలో తెలుగు జిల్లాలే కాక కర్ణాటకలోని కొన్ని జిల్లాలు మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు ఖమ్మంతో కలిపి 16 జిల్లాలుండేవి. అప్పటికి ఖమ్మం జిల్లా వరంగల్‌ జిల్లాలో భాగంగా ఉండేది. తెలంగాణ, ఆంధ్రరాష్ట్రంతో కలిసినప్పుడు తొమ్మిది జిల్లాలతోనే కలిసింది. కారణం 1956 నాటికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన కారణంగా తెలంగాణలోని కన్నడ భాషా జిల్లాలు అటు కర్ణాటకలో కలిసాయి. మరాఠా మాట్లాడే ప్రజలు ఉన్న జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. అప్పటి ఖమ్మంలో.. భద్రాచలం లేదు. అప్పట్లోఅది ఆంధ్రలోని తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా ఉండేది. అంటే 1956కి ముందు అంటే.. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందు తెలంగాణ విలీనం జరగక ముందు.. ఆంధ్రప్రదేశ్‌లో.. భద్రాచలం భాగం. అది తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత 1959 లో భద్రాచలం ప్రాంతం ఖమ్మం జిల్లాలో విలీనమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే… ఖమ్మం జిల్లాలో కలిపారు.

కేసీఆర్ కూడా భద్రాచలం కావాలని కోరలేదు..!

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన ప్రధాన డిమాండ్… 1956 నవంబర్‌ 1 నాటికి ఉన్న తెలంగాణ కావాలనేదే. అయితే.. తెలంగాణలో భాగంగా ఉన్న కర్ణాటకలోని జిల్లాలు, మహారాష్ట్రాలోని జిల్లాల ప్రజలు పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ఉద్యమానికి స్పందించలేదు. దాంతో.. తెలంగాణ భాగంగా రికార్డుల్లో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేశారు. భద్రాచలం అంతకు ముందు ఏపీలోనిది అన్న విషయాన్ని కేంద్రం పట్టించుకోలేదు. ఏపీ పార్టీలు కూడా… సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో.. భద్రాచలం తెలంగాణలో భాగం అయింది. హైదరాబాద్‌ను భౌగోళికంగా.. విడదీయలేము కాబట్టి… భద్రాచలం.. ఏపీదే కాబట్టి.. ఆ భద్రాచలాన్ని ఏపీలో క లపాలని చాలా మంది మేధావులు… పోరాడుతన్న వారికి సూచించారు. కానీ.. సమైక్యవాదం పేరుతో.. ఇక ఏ వాదనా వినిపించని.. సోకాల్డ్ ఉద్యమకారులు ఏపీని ముంచేశారు.

భద్రాద్రి కోసం కోర్టుకు వెళ్లి పోరాటం చేయలేరా..?

ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా భద్రాచలం అంశం తెరపైకి వచ్చింది. దీనికి కారణం.. పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ వల్ల.. భద్రాచలం మునిగిపోతుందని… ఆ ప్రాజెక్ట్ ప్రభావాన్ని అంచనా వేసే వరకు.. పోలవరాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టులో… తెలంగాణ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి రాజమండ్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అసలు భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌దేనని .. తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ఇది ఉత్త బెదిరింపులా ఉండకూడదు. ఎన్నికల తర్వాత కూడా రాజకీయ పార్టీలు ఈ డిమాండ్ ను.. ముందుకు తీసుకెళ్లాలి. భద్రాచలం ముంపును కారణంగా చూపి… పోలవరంను అడ్డుకోవాలంటే…భద్రాచలాన్ని వెనక్కి తీసుకోవడమే ఉత్తమం. సరిహద్దు అంశాన్ని న్యాయస్థానాల వరకూ తీసుకెళ్లాలి.

తెలంగాణలో ఆంధ్రా రామునికి అవమానాలు..?

తెలంగాణలో ఉన్న ఆంధ్రుడయిన రాముడికి అనేక అవమానాలు జరుగుతున్నాయి. శ్రీరామనవమికి.. ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రూ. ఏడాదికి వంద కోట్లిస్తానన్న కేసీఆర్.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంతే కాదు.. కనీసం పట్టువస్త్రాలు సమర్పించడానికి కూడా ఆయన రావడం లేదు. ఆయన మనవడితో ఓ సారి రాముడికి పట్టువస్త్రాలు సమర్పింప చేసి మరింతగా అవమానించారు. ఇలాంటి పరిస్థితులు మారాలంటే.. కచ్చితంగా భద్రాచలం ఏపీకి తిరిగివ్వాల్సిందే. మా రాముడ్ని మేం.. రాముడిగా చూసుకుంటాం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close