వాళ్లంతా కేసీఆర్ వెంట నడుస్తారట..! మరి చంద్రబాబు కోసం ప్రచారానికి వస్తున్నారేంటి..?

తాము పదహారు సీట్లు సాధిస్తే.. నూట అరవై సీట్లు సాధించే ఇతర పార్టీలు .. తమ వెనుక వస్తాయని.. దేశంలో అగ్గి పుట్టిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీయార్ ప్రకటించారు. కేటీఆర్ కూడా దాదాపుగా అదే చెబుతున్నారు. ఆ 160 సీట్లు సాధించే పార్టీలు ఏమున్నాయా.. అందరూ.. వెదుక్కూంటుంటే.. దానికి కూడా కేటీఆర్ సమాధానం ఇచ్చారు. అందులో మొదటిది జగన్మోహన్ రెడ్డి, తర్వాత మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్.. లాంటి ఇతర పార్టీల జాబితా చెప్పారు. మరి వారిలో ఒక్కరయినా… కేసీఆర్‌కు ఇప్పటి వరకూ మద్దతు ప్రకటించారా.. అంటే.. కనీసం.. ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పోనీ.. కేసీఆర్ వారికేమైనా మద్దతు ఇచ్చారా అంటే.. అదీ లే్దు.

మమతా బెనర్జీ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి.. ఏపీలో టీడీపీకి ప్రచారం చేయడానికి వస్తున్నారు. కానీ.. ఆమె టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడం లేదు. గతంలో.. మమతా బెనర్జీని కట్టడి చేయడానికి సీబీఐని ప్రయోగించినప్పుడు.. దేశంలోని విపక్షాలన్నీ అండగా నిలబడినా.. కేసీఆర్ మాత్రం నోరు తెరవలేదు. మరి మమతా బెనర్జీ …కేసీఆర్ వెంట ఎలా నడుస్తుంది..?. కనీసం మరోసారి భేటీకి అవకాశం ఇస్తుందా..? అలాగే ఫెడరల్ ఫ్రంట్ చర్చలంటూ.. కేసీఆర్… లక్నోకి పోవాలని రెడీ అయితే… మాయావతి, అఖిలేష్ ఇద్దరూ .. సమయం లేదని చెప్పేశారు. వారిని కలవకుండానే తిరిగి వచ్చారు. కానీ…మాయావతి పవన్ కల్యాణ్ కోసం.. ఏపీకి వస్తున్నారు. అఖిలేష్ యాదవ్ చంద్రబాబు కోసం వస్తున్నారు. వారంతా.. టీడీపీ కోసం… జిల్లాల్లో కూడా ప్రచారం చేయబోతున్నారు.

ఇక కేజ్రీవాల్ అయితే.. కేసీఆర్ తో ఇంత వరకూ ఒక్క సారి కూడా మాట్లాడలేదు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో… కూటమి ప్రయత్నాలు చేస్తున్నా.. కేంద్రం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న… కేజ్రీవాల్‌కు కేసీఆర్ కనీసం మాట సాయం చేయలేదు. ఇక కేటీఆర్.. తన 160 సీట్ల ఖాతాలోవేసుకున్న దేవేగౌడ ఇప్పటికి… కాంగ్రెస్ భాగస్వామి.ఆయన టీడీపీ కోసం ప్రచారం చేయడానికి ఏపీకి వస్తున్నారు. స్టాలిన్ కూడా.. చంద్రబాబు అడిగితే ప్రచారం చేస్తారు. ఇలా చెప్పుకుంటూ.. పోతే.. కేటీఆర్.. చెప్పిన ఆ నూట అరవై సీట్లు మొత్తం.. చంద్రబాబు వెనుక ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి కేటీఆర్, కేసీఆర్.. తమ వెనుక ఉన్నాయని ఎందుకని చెప్పుకుంటున్నారో… !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close