బ్రదర్ అనిల్ ఈ సారి బయటపడకుండా వ్యవహారాలు చక్కబెడుతున్నారట..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ.. ఆ తర్వాత కూడా… ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బ్రదర్ అనిల్‌కుమార్.. వైసీపీకి చేసే సేవ వేరుగా ఉంటుంది. చాలా సార్లు బయట పడ్డారు. కానీ ఈ సారి మాత్రం.. చాలా పక్కాగా.. తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. చర్చిల్లో.. ప్రత్యేక సమావేశాలు పెట్టి.. మరీ ఆయన వైసీపీకి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. జగన్‌ను దేవుడు పంపిన బిడ్డగా.. క్రైస్తవుల కోసమే… ఆయన పని చేస్తారన్నట్లుగా చెబుతూ… అందర్నీ.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని.. చెబుతున్నారట. ఈ విషయంపై..కొంత మంది పాస్టర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తూండటంతో.. కలకలం బయలుదేరింది.

చర్చి ఫాదర్లను, క్రైస్తవ మత పెద్దలను వైసీపీ అధినేత జగన్, ఆపార్టీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ సభలకు, ప్రచారానికి రాకుంటే అంతుచూస్తామని హెచ్చరిస్తున్నారని క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కన్వీనర్ జెరూషలేం మత్తయ్య ఆరోపిపిస్తున్నారు. వివిధ జిల్లాలో వారు చేసిన బెదిరింపులకు సంబంధించిన వివరాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని మత్తయ్య ప్రకటించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో క్రైస్తవ రాజ్యాధికార , రాజకీయ చైతన్య సదస్సు నిర్వహించి.. ఈ విషయాన్ని ప్రకటించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మత ప్రాదికన ఓట్లు అడిగేందుకు వైసీపీ నేత జగన్ కుట్రలు చేస్తున్నారని మత్తయ్య మండిపడ్డారు. బ్రదర్ అనిల్ కొంతమందికి వాహనాలు కొనుగోలు చేసి మరీ చర్చి ఫాదర్లపై ఒత్తిడి తెచ్చేలా టీంతో పని చేయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కుటుంబంతో చర్చిలలో ప్రార్ధనలు చేస్తూనే, మరోవైపు బీజేపీతో కలిసి హిందూత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, వైసీపీ కుట్రలకు బలికాకుండా ప్రజాస్వామ్య, లౌకిక వాద పార్టీలకే ఓటు వేయాలని మత్తయ్య చెబుతున్నారు. జగన్ బీజేపీతో అంటగాడుతున్నారని, పీయూష్ గోయల్ ఓపెన్ గా ప్రకటన చేసిన తర్వాత క్రైస్తవులపై దాడులు మరింత పెరిగాయన్నారు. వైసీపీకి ప్రచారం చేయని పాస్టర్లను లోటస్ పాండ్ కు తీసుకువెళ్లి హింసిస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ మత్తయ్య ఓటుకు నోటు కేసులో నిందితుడు. తన ప్రమేయం ఏమీ లేదని.. చంద్రబాబుపై సీబీఐ విచారణ చేయాలంటూ.. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close