ఫెయిలయిన విద్యార్థుల పేపర్లు దిద్దాలి..! సోమవారంలోపు చెప్పాలని హైకోర్టు ఆదేశం.. !

తెలంగాణలో ఫెయిలయిన ఇంటర్ విద్యార్థుల పేపర్లను మళ్లీ దిద్దాలన్న అభిప్రాయాన్ని తెలంగాణ హైకోర్టు వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం… ఫెయిలయిన మూడు లక్షల మంది విద్యార్థుల పేపర్లను.. దిద్దాలంటే.. రెండు నెలల సమయం పడుతుందని వాదించింది. ఈ వాదనపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తొమ్మిది లక్షల మంది విద్యార్థుల పేపర్లను.. కేవలం రెండు నెలల్లో దిద్దినప్పుడు.. మూడు లక్షల పేపర్లను మళ్లీ.. దిద్దడానికి రెండు నెలల సమయం ఎలా పడుతుందని ప్రశ్నించింది. పది రోజుల సమయం సరిపోతుంది కదా అని ప్రశ్నించింది. అయితే.. అడిషన్ ఏజీ రామచంద్రరావు మాత్రం… సమస్య త్రిసభ్య కమిటీ వేశామని… ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ జీవోను న్యాయమూర్తికి సమర్పించారు.

అయితే.. అందులో కేవలం ఏజెన్సీ నిర్లక్ష్యంపై విచారణ గురించి మాత్రమే ఉండటమే.. హైకోర్టు సమస్యకు పరిష్కారం ఏమిటని ప్రశ్నించింది. తెలంగాణలో 9 లక్షల మంది 70 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని 16 మంది ఆత్మహత్య చేసుకున్నా ఇప్పటి వరకు.. ఇంటర్‌బోర్డు స్పందించలేదని పిటిషన్‌ తరపు న్యాయవాది వాదించారు. న్యాయ విచారణ జరపాలనికోరారు.50 వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి.. ఆందోళనలు చేస్తున్నారనికోర్టుకు తెలిపారు. అయితే.. న్యాయ విచారణతో సమస్యకు పరిష్కారం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. బోర్డులోని లోపాలను ఎత్తిచూపాలనిసూచించింది.

విద్యార్థుల సమస్యలకు వారంలోపు సమస్యను పరిష్కరిస్తామన్న అడిషనల్‌ ఏజీ రామచంద్రరావు హైకోర్టును అభ్యర్థించారు. రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ కోసం… ప్రతి ఏటా 25 వేల దరఖాస్తులు వస్తాయి కానీ.. ఈ ఏడాది 9 వేల దరఖాస్తులే వచ్చాయని.. అంటే పెద్దగా.. అవకతవకలు జరగలేదని అర్థమన్నట్లుగా అడిషనల్‌ ఏజీ వాదించారు. అయితే.. హైకోర్టు మాత్రం లెక్కలు కాదు పరిష్కారం చెప్పాలని స్పష్టం చేశారు. సోమవారం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఆ రోజులోపు.. రీవాల్యుయేషన్‌పై నిర్ణయం తెలపాలని బోర్డుకు కోర్టు ఆదేశించింది. మరో వైపు ..రీ వాల్యూయేషన్, రీకౌంటింగ్ కు రెండు రోజుల గడువు పెంచారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close