ఇండియన్ రీడర్ షిప్ సర్వే..! ఈనాడు ఓకే..! ప్చ్.. సాక్షి..!

తెలుగు రాష్ట్రాల్లో… అత్యధిక పాఠాకాదరణ పొందిన పత్రికగా.., ఈనాడు.. తన మొదటి స్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తోంది. ఆ పత్రిక దరిదాపుల్లోకి కూడా …పోటీ పత్రికలు రాలేకపోయాయి. ఈనాడు పత్రికను సగటున కోటి 56 లక్షల 73 వేల మంది చదవుతున్నారని.. ఇండియన్ రీడర్ షిప్ సర్వే వెల్లడించింది. పోటీ పత్రికగా చెప్పుకుంటున్న సాక్షి మాత్రం సగటున 88 లక్షల 88వేల దగ్గర ఆగిపోయింది. మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి సగటున… తన పాఠకుల సంఖ్యను 62 లక్షల 88వేల వరకూ ఉంచుకోగలిగింది. అంటే.. సాక్షి, ఆంధ్రజ్యోతి పాఠకులు ఇద్దర్నీ కలిపినా.. ఈనాడే ముందుంజలో ఉంటుంది. మూడు దశాబ్దాలుగా పాఠకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.., ఈనాడు.. అగ్రస్థానంలో ముందుకు సాగుతోంది.

పాఠకుల సంఖ్య తగ్గకపోవడమే ఈనాడు విజయం..!

ప్రపంచవ్యాప్తంగా.. దినపత్రికలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దినపత్రికలు కొనడం , చదవడం తగ్గించి… ప్రజలు… ఆన్ లైన్ న్యూస్ వైపు మొగ్గుతున్నారు. సోషల్ మీడియా విజృంభణ తర్వాత పరిస్థితి మారిపోయింది. అనేక దేశాల్లో పత్రికలు మూతపడాల్సిన పరిస్థితి. కానీ.. ఇండియాలో మాత్రం.. పత్రికలు భారీ పెరుగుదల లేకపోయినా… ఎంతో కొంత రీడర్లను నిలబెట్టుకుని… పెంచుకుంటూ వస్తున్నాయి. అయితే..ఈ పెరుగుదల గత రెండేళ్లుగా.. తెలుగుదినపత్రికల్లో లేదు. తగ్గుదల ఉంది. కోటి 56 లక్షల 73 వేల మంది రీడర్లు ఉన్నట్లు ప్రకటించుకున్న ఈనాడుది కూడా తగ్గుదలే. 2017 తొలి త్రైమాసికంలో… ఈనాడు పాఠకుల సంఖ్య కోటి 58 లక్షల 48 వేలు. అంటే.. రెండేళ్లలో పాఠకుల సంఖ్యను పెంచుకోలేకపోయారు. పైగా.. రెండు లక్షలకుపైగా తగ్గిపోయారు. సహజంగా.. రెండేళ్లలో ఇరవై నుంచి 30 లక్షల వరకూ రీడర్లను పెంచుకుంటారని అనుకుంటారు. కానీ ఈనాడు కోల్పోయింది.

పాఠకులకు దూరమైపోతున్న సాక్షి..! పతనం చాలా వేగం..!

రెండేళ్ల కాలంలో.. రెండు లక్షల మంది రీడర్లను ఈనాడు కోల్పోయినప్పటికీ… ఎవరికీ అంతనంత ఎత్తులో ఉండటానికి కారణం.. పోటీ పత్రిక సాక్షి పూర్తిగా భారీగా పాఠకులను కోల్పోవడమే. 2017లో సాక్షికి 93 లక్షల 41వేల మంది పాఠకులు ఉండేవారు. ఇప్పుడది 88 లక్షలకు పడిపోయింది. ఆంధ్రజ్యోతి కూడా.. లక్షకుపైగా పాఠకుల్ని రెండేళ్లలో కోల్పోయింది. 2017 లో 63 లక్షల 54వేల మంది ఉన్న పాఠకులు… ఈ ఏడాది తొలి త్రైమాసికానికి 62 లక్షల 88వేలకు చేరుకున్నారు. అంటే.. లక్షకుపైగా.. పాఠకులు ఆంధ్రజ్యోతికి దూరమయ్యారు. అంటే. ఈనాడు సహా ప్రధాన పత్రికలన్నీ.. రీడర్లను కోల్పోతున్నాయి.

ముందు ముందు సవాళ్లేనని తేల్చిన ఐఆర్ఎస్ సర్వే..!

సాధారణంగా.. పోటీ పత్రికలు వచ్చి… ఆ పత్రికపై.. పాఠకులు ఆసక్తి చూపితే.. ఇతర పత్రికలకు రీడర్ షిప్ తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు … అన్ని దినపత్రికల రీడర్ షిప్ తగ్గిపోతోంది. దానికి కారణం… ప్రజలు పత్రికలు చదవడం మానేయడం కాదు. వారు.. ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లడం. వెబ్ సైట్లు, సోషల్ మీడియా న్యూస్‌పై ఆధారపడటం కారణంగా చెప్పుకోవచ్చు. డిజిటల్ ప్రపంచంలో.. న్యూస్ క్షణాల్లో చేరిపోతోంది. దాని వెనుక ఉన్న విశ్లేషణను అందించే న్యూస్ పోర్టల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడున్న పాఠకుల్ని నిలబెట్టుకోవడం… పత్రికలకు సవాల్ లాంటిదే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close